రామచంద్రపురం సబ్ జైలు తనిఖీ
మంచి ఆలోచన... మనిషి మనుగడకు దిక్సూచి
13వ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు జడ్జి బి హెచ్ వి లక్ష్మీ కుమారి
రామచంద్రపురం మేజర్ న్యూస్ :
మంచి స్వభావం మంచి పనులను కలిగి ఉంటుందని, చెడు స్వభావం చెడ్డ పనులు చెడ్డ ఆలోచనలు కలిగి ఉంటాయని వాటి వల్ల సమాజంలో మనిషికి అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయని వాటినుండి దూరంగా ఉండాలని సమాజంలో మంచి పౌరుడుగా బ్రతకాలని రామచంద్రాపురం 13వ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు జడ్జి బి హెచ్ వి లక్ష్మీ కుమారి అన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం ఆమె స్థానిక సబ్ జైలు ను తనిఖీ చేశారు. మహాత్మా గాంధీ విగ్రహానికి ఆమె పూలమాలవేసి నివాళులర్పించారు. వంటశాలను పరిశీలించి అక్కడ భోజన పదార్థాలను తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం రిమాండ్ ఖైదీలతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోలేని పేద రిమాండ్ ఖైదీలు ఎవరైనా ఉంటే వారికి కోర్టు ద్వారా ఉచితంగా న్యాయవాది ని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ జైలు సూపర్ండెంట్ పి. సత్యనారాయణ,లోక్ అదాలత్ ప్యానల్ న్యాయవాదులు దొమ్మలపాటి సత్యనారాయణ, నందిక కళ్యాణి, లోక్ అదాలత్ సిబ్బంది సుభాషిని తదితరులు పాల్గొన్నారు.