మహాత్మా గాంధీ ఆశయాలు కొనసాగిద్దాం : పి ఆర్ టి యు జిల్లా నాయకులు
నారాయణపేట, సూర్యన్యూస్ :
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని నారాయణపేట జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పి ఆర్ టి యు టి ఎస్ నారాయణపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వై జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.వెంకట్ రెడ్డి మాట్లాడుతూ గాంధీ ఆశయాలను కొనసాగిస్తూ ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షిస్తూనే ఉపాధ్యాయ సమస్యల సాధనకు సంఘం కృషి చేస్తుందని అన్నారు. రాబోయే కాలంలో గాంధీ చూపిన మార్గంలో ఉద్యమించి కాంట్రిబ్యూటర్ పెన్షన్స్ స్కీం విధానాన్ని రద్దు పరచడానికి అదేవిధంగా ఆర్థిక ప్రయోజనాలైనా పిఆర్సి సాధనకు కృషి చేద్దామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు ఏం.రఘువీర్, వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాల్ఘన్ జనార్ధన్, జహీరుద్దీన్, సత్యనారాయణ రెడ్డి, రమేష్, నరసింహారెడ్డి, రాష్ట్ర జిల్లా బాధ్యులు శంభులింగం, ప్రకాష్, నరేష్ కుమార్, ఫజల్, విజయ్ కుమార్, బాలాజీ, అరవింద్, గోపాలకృష్ణ, సాయప్ప, ఆంజనేయులు, అశోక్, శ్రీనివాస్, అమృత్ తిప్పన్న, సుదర్శన్, హిమనుషు, శశిధర్, భాస్కర్, సాదిక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
-- *రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట.*