శిథిలావస్థకు చేరిన సిసి రోడ్లు
రావులపాలెం మేజర్ న్యూస్
వెదిరేశ్వరం గ్రామంలో ఎస్సీ ఏరియాలో రోడ్లు బీటలువారి చిన్నపాటి వర్షం కురుస్తే చాలు రోడ్డు మీద నీరు నిల్వ ఉండి రాకపోకలకు అనేక ఇబ్బందులు కలుగుతుందని సామాజిక వేత్త బడుగు సుబ్బయమ్మ ఆరోపించారు. గాంధీజయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన గ్రామ సభలో సామాజిక కార్యకర్త బడుగు సుబ్బాయమ్మ, మరియు పాము నాగరాజు, బడుగు మహిమారావు వినతి పత్రం తో అధికారుల దృష్టికి సమస్య ను తీసుకు వెళ్లడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడచిన పది సంవత్సరముల నుండి ఎస్సీ ఏరియాలో ఎటువంటి మౌలిక వసతులు కల్పించలేదని. ఎస్సి ఏరియా ఇందిరాగాంధీ బొమ్మ ఆవరణములో ఉన్న రోడ్లు మరియు డ్రైనేజీ సమస్యల గురించి పంచాయతీ సెక్రటరీ
వి .సబిత కు వినతి పత్రాన్నిఅందజేశారు.పలుమార్లు గ్రామసభలో వినతి పత్రాలు ఇచ్చామని ఎందుకో ఎస్సీ ఏరియాలో రోడ్లు డ్రైనేజీలు
గురించి పట్టించుకోవటం లేదని ఈసారి గ్రామ సభ తీర్మానంలో మా ఏరియాలో రోడ్లు డ్రైనేజీల పై తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు.