గాంధీజీకి ఎంపీ కొండా ఘన నివాళులు
సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా గాంధీ పార్కులో మొక్కలు నాటిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి
వికారాబాద్, మేజర్ న్యూస్, (అక్టోబర్ 2): జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వికారాబాద్ పట్టణంలోని గాంధీ పార్కులో మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గాంధీ పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేయాలని ఎంపీ సూచించారు.మహాత్మా గాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని బీజేపీ శ్రేణులకు ఎంపీ పిలుపునిచ్చారు. ప్రజాసేవ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ సమాజ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు యు. రమేష్ కుమార్, వికారాబాద్ అసెంబ్లీ కోఆర్డినేటర్ వడ్ల నందు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అనిల్ కుమార్, చరణ్ రెడ్డి, సురేందర్, శ్యామ్ రెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షురాలు యాష్కీ శిరీష తదితరులు పాల్గొన్నారు.