BREAKING
అనుమతులు ఘనం.. బిల్లులు శూన్యం బీవీసీలో భట్లపాలెం నందు యువజన ఉత్సవాలు.. గోవింద నామస్మరణతో మార్మోగిన వాడపల్లి వెంకన్న ఆలయం మోడరన్ హైస్కూల్ లో ఆకట్టుకున్న రోబోటిక్స్ శిక్షణా కార్యక్రమం నగరంలో అంగన్వాడి ఉత్సవ్ వేడుకలు సైన్స్ ఎగ్జిబిట్స్‌పై విద్యార్థుల్లో ఆసక్తి పెంపు. నేటి రాశి ఫలాలు: 4 అక్టోబర్ 2026, ఆదివారం.. నేటి పంచాంగం: 4 అక్టోబర్ 2026, ఆదివారం మృతుల కుటుంబాలకు బిఆర్ఎస్ ఆర్థిక సహాయం కళ్యాణదుర్గం టి - సర్కిల్ అభివృద్ధి పనులకు శ్రీ కారం. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి నెక్కొండలో ఉపేందర్ హాస్పిటల్ పై అధికారుల దాడి అర్హులైన పట్టభద్రులు ఫారం- 18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలి హనుమకొండ ఆర్టీసీ డిపోలో ఎన్నికల ప్రచారం కళ్యాణదుర్గం కొల్లాపూరమ్మ ఆలయం లో చోరీ.

నల్లగొండ హజ్రత్ సయ్యద్ లతీఫ్ ఖాద్రీ ఉరుసు ఉత్సవాల్లో అన్నదానం

Select Suryaa Now
నల్లగొండ హజ్రత్ సయ్యద్ లతీఫ్ ఖాద్రీ ఉరుసు ఉత్సవాల్లో అన్నదానం

 

నల్లగొండ టౌన్, మేజర్ న్యూస్ : నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రసిద్ధి చెందిన హజ్రత్ సయ్యద్ షా లతీఫ్ ఉల్లా ఖాద్రీ రహ్మతుల్లాహి అలైహి ఉరుసు-ఎ-షరీఫ్ వేడుకలు నిన్న అక్టోబర్ 1వ తేదీ నుండి వైభవంగా ప్రారంభమైన విషయం తెలిసిందే కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు
మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల పోస్టర్ ను మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి ఆవిష్కరించారు.
మొదటి రోజు మదీనా మసీదు నుండి గంధం ఊరేగింపు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి.
రెండవ రోజు దర్గా శోభాయమానంగా దీపాలంకరణతో ముస్తాబు చేశారు, ప్రత్యేక దువాలు, ఫాతెహాలు నిర్వహించారు
భక్తులను అలరించేలా ఘనంగా ఖవ్వాలి కార్యక్రమం నిర్వహించారు 
తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఉరుసు కమిటీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది.
భక్తులకు తాగునీరు, విద్యుత్, మౌలిక వసతులలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, ఉరుసు కమిటీ సభ్యులు, సమీ ఉల్లా ఖాద్రి, జమాల్ ఖాద్రి ఇనాందార్లు, ముతవల్లీలు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.