పేదలకు అండగా కూటమి ప్రభుత్వం
-ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో తమ్మినేని చంద్రశేఖర్
ఆమదాలవలస, అక్టోబర్ 1, మేజర్ న్యూస్
ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతినెల ఒకటవ తేదీనే ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఎన్టీఆర్ పింఛన్ భరోసా పేదలకు అండగా ఉంటుందని రాష్ట్ర కళింగ కార్పోరేషన్ డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్ అన్నారు. ఆమదాలవలస మండలం తొగరంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఫలాలు అందిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతివారికి ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలు వారి చెంతకు చేరేలా ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని వివరించారు. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా వృద్దులు, దివ్యాంగులు, వితంతువులకు ఆర్థిక భరోసా కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు పెంపుదల చేసి ఇంటి వద్దకే అందించడం జరుగుతుందన్నారు. ఈ పింఛన్ల పంపిణీలో సచివాలయం సిబ్బందితో పాటు నాయకులు, లబ్ధిదారులు ఉన్నారు.