మాజీ లోక్‌సభ స్పీకర్ బాలయోగి ఆశయ సాధనకు పునరంకితం అవుదాం..: ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు..
అమలాపురం మేజర్ న్యూస్ మాజీ లోక్‌సభ స్పీకర్ స్వర్గీయ జి.యం.సి. బాలయోగి 75వ జయంతి సందర్భంగా అమలాపురంలోని బాలయోగి ఘాట్ వద్ద అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు బాలయోగి విగ్రహానికి, సమాధికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ.. జి.యం.సి. బాలయోగి అత్యున్నత లోక్‌సభ స్పీకర్ పదవిని అధిష్టించినప్పటికీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నిరాడంబరత, సౌమ్యత కలిగిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. పార్టీలోని ప్రతి ఒక్కరినీ, అన్ని వర్గాల నాయకులను, కార్యకర్తలను కలుపుకొని పోతూ సమన్వయ రాజకీయాలకు ఆదర్శంగా నిలిచారని గుర్తుచేసుకున్నారు.
బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా సమగ్ర అభివృద్ధికి, పేద, ఎస్సీ, ఎస్టీ, బహుజన వర్గాల అభ్యున్నతికి బాలయోగి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.అలాగే ఆయన తనయుడు, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాథుర్ తండ్రికి తగ్గ తనయుడిగా నిలుస్తూ, ఆయన చూపిన బాటలోనే నడుస్తున్నారని కొనియాడారు. యంగ్ అండ్ డైనమిక్ లీడర్‌గా పార్లమెంట్‌లో కోనసీమ సమస్యలపై గళం విప్పుతూ, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎంపీ హరీష్ మాథుర్ సేవలను ఎమ్మెల్యే ఆనందరావు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా జి.యం.సి. బాలయోగి 365 హెల్త్ కార్డులను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం-జనసేన-బిజెపి శ్రేణులు, బాలయోగి అభిమానులు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.