BREAKING
భారత్‌లో ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తున్న పెప్సికో, మాన్స్టర్ వెనిజులాలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్న ఐఎంఎఫ్ స్పష్టీకరణ ఇజ్రాయెల్ సెటిలర్ల కాల్పుల్లో పాలస్తీనా వ్యక్తి మృతి కోనసీమ ముఖద్వారం రావులపాలెంకు ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’ అవార్డు రేపు ధర్మవరం, పుట్టపర్తిలలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటన * స్వచ్ఛభారత్, చెక్కుల పంపిణీతో పాటు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్ర సత్య కుమార్ యాదవ్ ధర్మవరం/పుట్టపర్తి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే జారే... ... బ్రెజిల్‌లో తుది దశకు ఎన్నికల వేడి - చివరి టీవీ డిబేట్‌ను బహిష్కరించిన అధ్యక్షుడు లూలా గ్రామీణ క్రీడాకారుల ప్రతిభకు వేదికగా ఆత్మకూరు క్రీడావికాస కేంద్రం అటార్నీ జనరల్ రోజర్ మారియాకా అరెస్ట్, డ్రగ్స్ అక్రమ రవాణా ఆరోపణలు వైసీపీ నుంచి టీడీపీ లోకి భారీ చేరికలు .....పదవుల కోసం కాదు... చిన్న శ్రీను వెంటే...... 1998 తర్వాత గరిష్ట స్థాయికి గిల్ట్ ఈల్డ్స్, కుప్పకూలిన బ్యాంకుల షేర్లు 30వ వార్డు సమస్యలపై శిరీషా ఫోకస్ కిల్‌సెక్ హ్యాకర్ గ్రూప్ 16 ఏళ్ల లీడర్‌ను అరెస్ట్ చేసిన స్పానిష్ పోలీసులు కోనసీమ వాసుల దశాబ్దాల కలకు ఊతం.. నోటీస్ ఇవ్వకుండానే భూమి బదలాయింపు ఎలా? * తీవ్ర అన్యాయం జరిగిందంటూ భావిశెట్టి శేఖర్ ఆరోపణ

మత్స్యకార కుటుంబాలకు ఉచిత బియ్యం పంపిణీ

Select Suryaa Now
మత్స్యకార కుటుంబాలకు ఉచిత బియ్యం పంపిణీ


-తుఫాన్ కారణంగా నష్టపోయిన కుటుంబాలకు భరోసా 
-బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే కూన రవికుమార్
ఆమదాలవలస, అక్టోబర్ 1, మేజర్ న్యూస్ 
తుఫాన్ కారణంగా నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భరోసా కనిపిస్తూ ఉచిత బియ్యాన్ని అందించారని ఆముదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ తెలియజేశారు. ఆమదాలవలస మున్సిపాలిటీ 18 వ వార్డు కండ్రపేటలో 130 మత్స్యకార  కుటుంబాలకు ఇంటి వద్దకే వెళ్ళి 50 కేజీల బియ్యం గురువారం పంపిణీ చేశారు. అర్నబ్  తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, సముద్రంలో అలజడి కారణంగా మత్స్యకారులు ఆ సమయంలో ఐదు రోజులపాటు వేటకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో మత్స్యకార కుటుంబాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వం అండగా నిలిచిందని ఎమ్మెల్యే తెలిపారు.ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆమదాలవలస నియోజకవర్గంలో మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సహాయం అందించారు. తుఫాన్ కారణంగా వేటకు వెళ్లలేక ఉపాధి కోల్పోయిన సమయంలో ప్రభుత్వం అందించిన సహాయం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందని మత్స్యకార కుటుంబాలు ఎమ్మెల్యేకు తెలిపారు.