నోటీసులు అందుకున్న ఓటర్ల వద్దకే బిఎల్ఓలు.. సీఈవో సుదర్శన్ రెడ్డి కీలక ప్రకటన
హైదరాబాద్, సూర్య ప్రతినిధి :తెలంగాణలో స్థానిక ఓటర్ల నమోదు, జాబితా పరిశీలన ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయడమే ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సి. సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.
నోటీసులు జారీ చేసిన ఓటర్లను ఒకచోటకు పిలిపించడం కాకుండా, బూత్ లెవల్ అధికారులు (BLO) స్వయంగా ఓటర్ల ఇళ్ల వద్దకే వెళ్లి పత్రాలు సేకరిస్తారని ఆయన తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే ఈ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు.
ఓటరు నమోదు మరియు ఫారమ్-6 ప్రక్రియపై స్పష్టతనిస్తూ, ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అమల్లో లేని రాష్ట్రాల్లో ఓటర్లకు ఫారమ్-6 సబ్మిట్ చేసేటప్పుడు ఎలాంటి డిక్లరేషన్ పత్రం అవసరం లేదని తెలిపారు. అయితే, ప్రస్తుతం సర్ నివేదన (SIR) ప్రక్రియ కొనసాగుతున్న తెలంగాణ వంటి రాష్ట్రాల్లో మాత్రం కొత్తగా ఓటరుగా నమోదయ్యేందుకు లేదా వివరాలు సరిచేసుకునేందుకు ఫారమ్-6 సమర్పించే అభ్యర్థులు డిక్లరేషన్ ఇవ్వడం తప్పనిసరి అని సీఈవో విస్పష్టంగా పేర్కొన్నారు.