సీతానగరంలో మత్స్యకారులకు బియ్యం పంపిణీ
సంతబొమ్మాళి, అక్టోబర్ 1,మేజర్ న్యూస్ :
తుపాను నేపథ్యంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లలేని మత్స్యకార కుటుంబాలకు కూటమి ప్రభుత్వం 50 కిలోల బియ్యం అందజేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలతో సంతబొమ్మాళి మండలం నౌపడా పంచాయతీ సీతానగరం గ్రామంలో 380 కుటుంబాలకు 50 కిలోల బియ్యం చొప్పున మాజీ సర్పంచి కర్రి విష్ణుమూర్తి సమక్షంలో తెదేపా సీనియర్ నాయకులు, మత్స్యకార సంఘం అధ్యక్షులు వాడరేవు కృష్ణారావు చేతుల మీదుగా లబ్ధిదారులకు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా వాడరేవు కృష్ణారావు మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని, మత్స్యకారుల కోసం రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చూపిన చొరవ.. స్ఫూర్తి హర్షణీయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో సుగ్గు నాగిరెడ్డి,లింగూడు కుమార్, బ్రహ్మానందం,బత్సల గోపాల్, బత్సల చిన్నబాబు, పొన్నాడ రామారావు, తదితరులు పాల్గొన్నారు.