పేదలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అండ
మెలియాపుట్టి. అక్టోబర్.01. మేజర్ న్యూస్.....
అర్హులైన పేద కుటుంబాలకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయని శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీ అనపాన రాజశేఖర్‌రెడ్డి అన్నారు. గురువారం మెలియాపుట్టి మండల కేంద్రంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రతి నెలా సామాజిక పింఛన్లను అందిస్తూ ఆర్థిక భద్రత కల్పిస్తోందన్నారు. పేద కుటుంబాల్లో పింఛన్ సొమ్ము ఎంతో కీలకంగా మారిందని, రోజువారీ అవసరాలు, మందులు, ఇతర కుటుంబ ఖర్చులకు ఇది తోడ్పాటునందిస్తోందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక భద్రతా పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పింఛన్ సొమ్మును కుటుంబ అవసరాలకు ప్రాధాన్యమిస్తూ వినియోగించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అర్హత ఉన్నప్పటికీ పింఛన్ అందని వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.
ప్రతి నెలా తమకు పింఛన్ అందుతుండటంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. పింఛన్ సొమ్ము తమ కుటుంబ అవసరాలకు ఎంతో ఉపయోగపడుతోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ మోహన్‌కృష్ణ, దుక్క శంకర్‌రెడ్డి, బస్వ దనం, దున్న పండిరీనాదం, పింఛన్ లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.