రాష్ట్ర పోటీలకు జిల్లా జట్ల ఎంపిక.
ఆదివారం పలాసలో ఎంపిక పోటీలు.
పలాస, అక్టోబర్ 1,మేజర్ న్యూస్.
రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ పోటీలకు శ్రీకాకుళం జిల్లా జట్లను ఎంపిక చేయనున్నారు.పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో శ్రీకాకుళం జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ పురుషులు మరియు మహిళల విభాగంలో రాష్ట్ర స్థాయి ఎంపికలు నిర్వహించనున్నారు.ఈ నెల 4న ఆదివారం ఉదయం 9 గంటలకు ఎంపికలు జరుగుతాయని అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మల్లా సంతోష్ కుమార్, సుడియా వెంకట జోగారావు, పోటీల నిర్వహణ కార్యదర్శి పి. తవిటయ్య తెలిపారు.ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకురావాలని సూచించారు.ఈ ఎంపికల్లో ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 11 నుండి 13 వరకు పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగే 50వ అంతర్ జిల్లాల టెన్నికాయిట్ పోటీల్లో పాల్గొంటారని తవిటయ్య తెలిపారు.