BREAKING
గ్రీన్ ఫీల్డ్ హైవే పై లారీ బోల్తా పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలిలేకుంటే ఉద్యమాలు తప్పవు: సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజారామ్మోహన్‌రాయ్ రామయ్య కథ సుఖాంతం.. నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ * సిబ్బందితో ప్రత్యేక సమీక్ష! డైరెక్టర్ రంజిత్ భాషకు అభినందనలు తిరుపతి ఎడ్యుకేషన్ మేజర్ న్యూస్ జీవో నెంబర్ 24 ఎయిడెడ్ అబ్జర్వ్ డ్ ప్రభుత్వం సర్వీస్ రూల్ రావడానికి సహకరించిన ఇంటర్మీడియట్ డైరెక్టర్ రంజిత్ భాషకు నాన్ టీచింగ్ అసోసియేషన్ నేతలు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయనను వారి కార్యాలయంలో చిత్తూరు జిల్లా నాన్ టీచింగ్ అసోసి కాకినాడ టు నరసాపురం రైలుకు.. రూ వన్ ద కోట్ల భూతం సూర్య వార్తపై ప్రజల్లో అభినందనలు ఘనంగా కలాం స్పూర్తి యూత్ కా వికాస్ గోదావరి డెల్టా ఆధునికీకరణకు ప్రాధాన్యత అర్హులందరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించాలి: మంత్రి గొట్టిపాటి రవికుమార్ హిందీ భాషను మరింత అభివృద్ధి చేయాలి ఎస్ ఎమ్ సి కమిటీలను సత్కరించిన టీడీపి నేతలు పేదల సంక్షేమమే లక్ష్యంగా.. * పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవి గ్రామీణ రూపురేఖలు మార్చడమే పల్లె పండగ ధ్యేయం నిత్యావసరాల ధరలు తగ్గించకపోతే చర్యలుపేద, మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం మోపితే సహించం: జేసీ కల్పశ్రీ చాలీచాలని జీతాలతో బతుకు బండి లాగలేకపోతున్నాం.! *కనీస వేతనం2600 చెల్లించి ఆదు కోవాలని డిమాండ్.! థియేటర్లలోకి ఎమోషనల్ అండ్ ఫాంటసీ డ్రామా.. నివిన్ పౌలీ ‘ఏడు కడల్ ఏడు మలై’ విడుదల

ఎస్‌ఐఆర్‌లో పెండింగ్ నోటీసుల జారీని రెండు రోజుల్లో పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

Select Suryaa Now
ఎస్‌ఐఆర్‌లో పెండింగ్ నోటీసుల జారీని రెండు రోజుల్లో పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

ఎస్‌ఐఆర్‌లో పెండింగ్ నోటీసుల జారీని రెండు రోజుల్లో పూర్తి చేయాలి.
బీఎల్‌వోలు ఓటర్ల ఇళ్లకు వెళ్లి నోటీసులు అందజేయడంతో పాటు అవసరమైన పత్రాలు సేకరించాలి.
జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

సంగారెడ్డి , : ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కాని ఓటర్లు, అనామలీస్ జాబితాలో ఉన్న ఓటర్లలో నోటీసులు పెండింగ్‌లో ఉన్న వారందరికీ రెండు రోజుల్లోగా నోటీసులు జారీ చేసే ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు.ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా నోటీసుల జారీ, డిక్లరేషన్ ఫారాలు, ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తుల పరిష్కారం తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి గురువారం హైదరాబాద్ నుంచి సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.
ఈ సందర్భంగా సీఈఓ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, అనామలీస్, మ్యాపింగ్ కాని ఓటర్లలో నోటీసులు పెండింగ్‌లో ఉన్న వారందరికీ త్వరితగతిన నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఏ ఒక్క ఓటరు కూడా కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా బీఎల్‌వోలు స్వయంగా ఓటర్ల ఇళ్లకు వెళ్లి నోటీసులు అందజేయడంతో పాటు అవసరమైన పత్రాలను సేకరించాలని సూచించారు.
ఇల్లు లేని వారు, అవసరమైన పత్రాలు అందుబాటులో లేని ఓటర్ల కోసం హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసి, అవసరమైన సందర్భాల్లో పంచనామా తదితర ప్రక్రియల ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. అనర్హులు లేదా ఇతర ప్రాంతాలకు తరలిపోయిన ఓటర్లకు సంబంధించి ఫారం-6 ప్రక్రియలో స్పీకింగ్ ఆర్డర్ తరహాలో డిక్లరేషన్ ఫారం ఇవ్వాలని సూచించారు. ఫారం-7కు సంబంధించి బల్క్‌గా దరఖాస్తులను స్వీకరించరాదని, ప్రతి దరఖాస్తును విడివిడిగా పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించాలని ఈఆర్వోలను ఆదేశించారు. అలాగే ఈఆర్వోలు, ఏఈఆర్వోలు తమ నోటీస్ బోర్డులపై ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తుల పరిష్కారం, అనామలీస్ మరియు మ్యాపింగ్ కాని ఓటర్లకు సంబంధించిన పరిష్కార వివరాలను ప్రతిరోజూ ప్రదర్శించాలని సూచించారు.
కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సంబంధిత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, సంగారెడ్డి జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా మొత్తం 4,60,387 నోటీసులు జనరేట్ చేయగా, ఇప్పటివరకు 4,44,175 మంది ఓటర్లకు నోటీసులు అందజేశామని తెలిపారు. 3,52,256 మంది ఓటర్లకు సంబంధించి హియరింగ్ ప్రక్రియ పూర్తయిందని వివరించారు.
జిల్లాలో ఇంకా 16,212 మంది ఓటర్లకు నోటీసులు అందజేయాల్సి ఉందని, పెండింగ్‌లో ఉన్న వారందరికీ బీఎల్‌వోల ద్వారా రెండు రోజుల్లోగా నోటీసులు అందజేసి, అవసరమైన పత్రాలను సేకరించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.ఫారం-7కు సంబంధించి జిల్లాలో ఎలాంటి బల్క్ దరఖాస్తులను స్వీకరించడం లేదని సీఈఓకు వివరించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ప్రతిరోజూ పరిష్కరించిన ఫారం-6, ఫారం-7, ఫారం-8, అనామలీస్, మ్యాపింగ్ కాని ఓటర్లకు సంబంధించిన పరిష్కార వివరాలను నోటీస్ బోర్డులపై ప్రదర్శిస్తామని తెలిపారు.
జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పేర్కొన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ పాండు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.