హిందీ భాషను మరింత అభివృద్ధి చేయాలి
హిందీభాషను ప్రొత్సహించి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఎన్ఎస్ఈయూ వీసీ ప్రొఫెసర్ జీఎస్ఆర్ కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. జాతీయ సంస్కృత వర్సిటీ హిందీ రాజభాషా విభాగం ఆధ్వర్యంలో గత నెల ఒకటవ తారీఖు నుంచి నెల రోజుల పాటు జరిగిన హిందీ మాసోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడుతూ సంస్కృతం, హిందా బాషలకు గొప్ప వారత్వం ఉందని, వాటి ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. రెండు బాషల అభివృద్ధికి ప్రతి వ్యక్తి కృషి చేయాలని సూచించారు. అనంతరం మాసం రోజులగా చేపట్టిన పలు కార్యక్రమాలలో భాగంగా విద్యార్థులకు, బోధన, బోధనేతర సిబ్బందికి పలు రకాల హిందీ భాషపై పోటీలు నిర్వహించారు. ప్రతిభ చూపిన వారికి అతిథులు, అధికారుల చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ వెంకటనారాయణరావు, డీన్ రజనీకాంత్ శుక్లా, డాక్టర్ లతామంగేష్, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.