గ్రామీణ రూపురేఖలు మార్చడమే పల్లె పండగ ధ్యేయం
గ్రామ స్వరాజ్య సాధన లక్ష్యంగా చంద్రబాబు పాలన. ఉనికి కోసమే గొడ్డలి పార్టీ తాపత్రయం. పల్లెల ప్రగతికి కూటమి ప్రభుత్వ ప్రధమ ప్రాధాన్యత. పేద బడుగు బలహీన వర్గాల కాలనీలో మౌలిక వసతులు కల్పనకు చంద్రబాబు పెద్దపీట. నాడు టెక్నాలజీ నేడు జల వనరులతో ఏపీ భవిష్యత్తుకు బాటలు. రవాణా వ్యవస్థ తోనే అభివృద్ధికి దోహదం. అభివృద్ధి సంక్షేమం పరుగుకు ప్రతీక చంద్రబాబు. 1.85 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన గొట్టిపాటి లక్ష్మి. విమర్శలు చేసే నేతలకు అభివృద్ధి మా సమాధానం. ప్రతిపక్ష నేతలకు గొట్టిపాటి లక్ష్మి సూటి ప్రశ్న.
కురిచేడు మేజర్ న్యూస్.
రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల సమగ్ర స్వరూపాన్ని మార్చి గ్రామ స్వరాజ్య సాధన లక్ష్యమని, గ్రామాల్లో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన మెరుగైన జీవన ప్రమాణాలు నిరంతర ఉపాధి అవకాశాన్ని సృష్టించడం ద్వారా పల్లెలను సమృద్ధి కేంద్రాలుగా సీఎం చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దుతున్నారని నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు. కురిచేడు మండలంలోని కాశీపురం టు వెల్లంపల్లి రోడ్డు కు శనివారం కోటి 85 లక్షలురూపాయల తో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి, పెన్షన్లను పంపిణీ చేసి, పి - ఫోర్ కార్యక్రమాన్ని ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూరెండేళ్ల కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ , ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు సారధ్యంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందని మీరు చూస్తున్నారు. రెండేళ్లలో ఒక్క కాశీపురం గ్రామంలోని రెండు కోట్ల 25 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళుతున్నాం అంటే అభివృద్ధి ఏమిటో అర్థం చేసుకోవాలి. గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంలో ఐదు లక్షలు అయినా ఈ గ్రామానికి ఖర్చు పెట్టారా అని డాక్టర్ లక్ష్మీ ప్రశ్నించారు. ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు ప్రజల కోసం, ప్రజల బాగోగులు కోసం నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్నారు. అలాంటి మన అధినేత చంద్రబాబును విమర్శించే స్థాయి ప్రతిపక్ష నేతలకు లేదని అభివృద్ధితో సమాధానం చెబుతున్నామని ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమం ముందుకు తీసుకు వెళుతూ.. సూపర్ సిక్స్ పథకాలను ప్రతి ఇంటికి చేరుస్తూ అభివృద్ధి ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. అదే స్ఫూర్తితో మనం దర్శి నియోజకవర్గంలో, అభివృద్ధి ఎజెండాగా ముందుకు వెళుతున్నామని డాక్టర్ లక్ష్మి అన్నారు. వైసీపీ సైకో బ్యాచ్ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు ప్రెస్ మీట్ లు పెడతారు విమర్శలు చేస్తారు. కనిపించకుండా పోతారు. మన మధ్య చిచ్చు పెట్టి పోతారు. అప్రమత్తంగా ఉండాలి మన అభివృద్ధి తో సమాధానం చెప్పాలి. వారిని ఎదుర్కోవాలి కలిసికట్టుగా ముందుకు వెళ్లాలి. అభివృద్ధి ప్రభుత్వాన్ని ఆదరించాలి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఐకమత్యంగా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలి. అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లాలి. ఈ కార్యక్రమంలో దర్శి ఏఎంసి చైర్మన్ దారం నాగువేణి - సుబ్బారావు, కురిచేడు మండల టిడిపి అధ్యక్షులు విడతల నెమిలయ్య, ఒంగోలు పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షులు కాట్రాజు నాగరాజు, ఎంపీడీఓ, సీనియర్ జర్నలిస్ట్ గొట్టిపాటి నాగేశ్వరావు, గొట్టిపాటి వెంకటేశ్వర్లు, క్లస్టర్ ఘనపతి వెంకటేశ్వర్లు, ఐ. టిడిపి మండల అధ్యక్షులు కాళ్ల వెంకటేశ్వర్లు, కాశీపురం గ్రామ టిడిపి నాయకులు శేఖర్,చిన్న వెంకట సుబ్బయ్య, కాటం రాజు, మాజీ సర్పంచ్ సుబ్బయ్య, వీరనారాయణ, మండలంలోని వివిధ హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ మస్తాన్ వలి, డాక్టర్ సునీల్, ఆదినారాయణ, నూనె విజయకుమారి, ఇజ్రాయల్, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.