చాలీచాలని జీతాలతో బతుకు బండి లాగలేకపోతున్నాం.! *కనీస వేతనం2600 చెల్లించి ఆదు కోవాలని డిమాండ్.!
మెరకముడిదాం అక్టోబరు 1, మేజర్ న్యూస్:
ఎన్నో ఏళ్లగా అపరిస్కృతంగా, మిగిలియున్న ఫీల్డ్ అసిస్టెంట్లు సమస్యలపై రాష్ట్ర కార్యవర్గం ఆదేశాల మేరకు మండల ఫీల్డ్ అసిస్టెంట్లు యూనియన్ గురువారం మండల ఉపాధి హామీ అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ అధికారి సాకేటి పెద్ద అప్పలనాయుడుకు డిమాండ్లతో కూడిన వినతి పత్రమును సమర్పించింది. 2006 ప్రారంభమైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ప్రారంభమై 19 సంవత్సరాలు కావస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు జీతాలు 5745 రూపాయలు తోనే సరిపెట్టుకుంటున్నాం. ఈ చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ దుర్భరంగా ఉంది. ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి కూలీలకు భరోసా కల్పిస్తూ, గ్రామపంచాయతీ స్థాయిలో సుస్థిర, శాశ్వత ఆవృద్ధికి తోడ్పాటు ఇస్తున్న అసిస్టెంట్లకు 26 వేల రూపాయలు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ లను అక్రమంగా తొలగించరాదని వారికి భద్రత కల్పించాలని డిమాండ్ లో పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ సమస్యలు తీరుతాయని ఉంచామని అయితే సమస్యలు గత ప్రభుత్వంలో ఉన్నట్లే ఉన్నాయని వాపోయారు. రెండేళ్లగా సమస్యలపై అనునిత్యం పోరాడుతున్న సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబర్ 5 2026 లోగా సమస్యలు పరిష్కారం కాకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడుతామని, అవసరమైతే సమ్మెకు పిలుపునిస్తామని అన్నారు. గురువారం ఫీల్డ్ అసిస్టెంట్లు ఏపీవో కు సమర్పించిన డిమాండ్ల వివరాలు ఇలా ఉన్నాయి. కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, జూన్ నెల జీతం ఇప్పించాలని, సంవత్సరములు పూర్తి చేసిన ఫీల్డ్ అసిస్టెంట్ లందరికీ ఉపాధి సిబ్బంది మాదిరిగా ఎఫ్టీఇ వర్తింపజేయాలని, ఫీల్డ్ అసిస్టెంట్లు కు ఇచ్చే టార్గెట్ 7500 పని దినాలను రద్దు చేయాలని, ప్రమాదాలు సంభవిస్తే ఫీల్డ్ అసిస్టెంట్లకు అన్ని విధాల సౌకర్యాలు వర్తింపజేయాలని, అర్హత గల ఫీల్డ్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించాలని, ఎంఎంఎస్ యాప్ భువన యాప్ వాడుతున్న సందర్భంగా ఫైవ్ జీ మొబైల్ ఫోన్లను సమకూర్చాలని డిమాండ్లతో గురువారం ఫీల్డ్ అసిస్టెంట్లు ఎపిఓ సాకేటి. పెద్ద అప్పల నాయుడు కు మెమోరాండం సమర్పించారు.