telanagana
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
Telanagana
01 Oct 2026
54 views
By సూర్య ప్రతినిధి
Updated : 01 Oct 2026 19:42 IST
Select Suryaa Now
పలువురు నేతలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎంపీ
కీసర, యాదగిరిపల్లి గ్రామాల నుంచి బీజేపీలో చేరిన నాయకులు, కార్యకర్తలు
కీసర, మేజర్ న్యూస్ (అక్టోబర్ 1):తెలంగాణలో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. కీసర డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కోల బాలరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో గురువారం కీసర, యాదగిరిపల్లి గ్రామాలకు చెందిన పలువురు నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు ఎంపీ ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు. వీరందరికీ ఆయన పార్టీ కండువాలు కప్పి సాధరంగా ఆహ్వానించారు.
బీజేపీ వైపే ప్రజల చూపు:
కీసర గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఉపసర్పంచ్ కందాడి బాలమణి ప్రభాకర్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు కళాసికం వినోద్ కుమార్, ఎం. వెంకటేశ్వరరావు, ఆర్. కొండల్ రెడ్డి, కే. కృష్ణారెడ్డి, కొరడి ఆంజనేయులు, రామారం రమేష్, జూపల్లి కృష్ణ తదితరులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.అలాగే యాదగిరిపల్లి గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యుడు బోయిని భాస్కర్ ముదిరాజ్, లెక్చరర్ కొమ్ము చిరంజీవి, యువ నాయకులు బోయిన రాంబాబు, లింగంతో పాటు పలువురు కార్యకర్తలు పార్టీలో చేరారు.
కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: ఎంపీ ఈటల రాజేందర్
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ,.. రాష్ట్రంలో రోజురోజుకూ బీజేపీకి ప్రజల నుంచి ఆదరణ పెరుగుతోందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, సీనియర్ నాయకుడు నాగారం మున్సిపల్ మాజీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, సింగిరెడ్డి వెంకట్ రెడ్డి, జిల్లాల తిరుమలరెడ్డి, జిల్లా కార్యదర్శి బోడ శ్రీనివాసరావు, జిల్లా నాయకులు మెట్టు కృష్ణ యాదవ్, దొబ్బల శ్రీశైలం, ఏలూరు సత్యనారాయణ, తర్రె సత్యనారాయణ, చంద్రమౌళి, తర్రె కృష్ణ యాదవ్, లింగం ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ కర్రె గణేష్.