BREAKING
గ్రామ సభలో నిధుల లేక్కెంటీ..? అంగన్వాడీలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలి గాంధీ జయంతి రోజున ముంబైలో సీజేపీ నిరసన: జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో రోడ్లపైకి జనం, పోలీసుల అనుమతి నిరాకరణ మధ్య ఉద్రిక్తత బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై చంద్రబాబు చెప్పేవి అబద్ధాలు: రాజమహేంద్రవరంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సవాల్, 100 సీట్ల హామీపై నిలదీత చీనాబ్ - అంజీ బ్రిడ్జిలపై తొలిసారి గంటకు 100 కి.మీ. వేగంతో వందే భారత్ రోజూ కాఫీ తాగుతున్నారా... లివర్‌పై దాని ప్రభావం ఇదే! పండ్లు ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది? ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో తినడంపై నిపుణుల సలహాలు! విద్యార్థుల కల నెరవేరింది... బిసి హాస్టల్ మెస్ చార్జీల పెంచిన ప్రభుత్వం -కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు -తిరుపతిలో సీఎం డిప్యూటీ సీఎం, మంత్రుల చిత్రపటాలకు పలాభిషేకం సిగ్మా మూవీ రివ్యూ.. జేసన్ సంజయ్ దర్శకత్వ ప్రతిభ, సందీప్ కిషన్ నటన మెప్పించాయా? బాక్సాఫీస్ వద్ద తగ్గిన నాని ది ప్యారడైజ్ జోరు.. గాంధీ జయంతి సెలవు దినాన కూడా కలెక్షన్లలో పతనం! వాయిదా పడిన ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్ ఉడ్తా తిర్ సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ! జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఘనస్వాగతం పలికిన తులసి రామకృష్ణ కొడుకు సినిమా పోస్టర్‌ను గర్వంగా ప్రదర్శించిన తమిళనాడు సీఎం విజయ్.. మధురాంతకం రోడ్‌షోలో అరుదైన దృశ్యం! ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం

గ్రీన్ ఫీల్డ్ హైవే పై లారీ బోల్తా

Select Suryaa Now
గ్రీన్ ఫీల్డ్ హైవే పై లారీ బోల్తా

ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో /పెనుబల్లి సూర్య మేజర్ న్యూస్....

గ్రీన్ ఫీల్డ్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గ్రీన్‌ఫీల్డ్ హైవేపై వేంసూర్ ఎగ్జిట్ సమీపంలో ట్రాలీ లారీ అదుపుతప్పి రోడ్డుపై అడ్డంగా బోల్తా పడటంతో హైవేపై  ఒక వైపు వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఖమ్మం నుండి సత్తుపల్లి కి రోడ్డు రోలర్లను తీసుకు వెళ్తున్న ట్రాలీ లారీ  అదుపు తప్పి రైలింగ్ ను బలంగా ఢీకొట్టి ప్రమాదానికి గురై ట్రాలీ లారీ బోల్తా పడింది. ట్రాలీ లారీ పైన గల రోడ్ రోలర్లు కూడా రోడ్డుపై పడిపోవడంతో రాకపోకలు పూర్తిగా ఒకవైపు స్తంభించిపోయాయి. ఐదు కిలోమీటర్ల మేర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గ్రీన్ ఫీల్డ్ హైవే సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్లను రప్పించి, రోడ్డుపై అడ్డంగా ఉన్న లారీని, రోడ్డు రోలర్లను పక్కకు తొలగించి ట్రాఫిక్ ని పునరుద్ధరించారు.