ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఆరిపాక రాముకు ఘన సత్కారం
నెల్లిమర్ల అక్టోబరు 1, మేజర్ న్యూస్:
ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సీనియర్ జర్నలిస్ట్ ఆరిపాక రామును స్థానిక మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ జనా ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జనాప్రసాద్‌తో పాటు విశ్వబ్రాహ్మణ సంఘం గౌరవాధ్యక్షుడు వీర్ని సూరిబాబు, అధ్యక్షుడు వీర్ని చిదంబరం, ప్రధాన కార్యదర్శి కాకినాడ గుప్తేశ్వరరావు తదితరులు రామును దుశ్సాలువతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ కులానికి చెందిన రాము ప్రతిష్టాత్మకమైన జర్నలిజం సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక కావడం ఎంతో గర్వకారణమని, భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.
ఈ అభినందన కార్యక్రమంలో సంఘ నాయకులు వేముల తాతాచారి, పక్కి చిదంబరం, కొమ్ముజు ప్రసాద్, ప్రతినిధులు మంతెన రమణ, కొత్తపల్లి శ్రీనివాసరావు, సారంపాటి గణపతి రావు పాల్గొన్నారు.