BREAKING
రేపు కల్కి భగవాన్ మహాసమాధి.. అధికారిక లాంఛనాలతో ఏర్పాట్లు పూర్తి అమెరికాలో ఊహించని రీతిలో పెరిగిన నిర్మాణ రంగ వ్యయాలు అమరావతిలో నారా లోకేష్‌తో చిన్న శ్రీను, సిరమ్మ భేటీ ,విజయనగరం జిల్లా పార్టీ పరిస్థితులపై చర్చ.. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచన భారత్‌లో ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తున్న పెప్సికో, మాన్స్టర్ వెనిజులాలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్న ఐఎంఎఫ్ స్పష్టీకరణ ఇజ్రాయెల్ సెటిలర్ల కాల్పుల్లో పాలస్తీనా వ్యక్తి మృతి కోనసీమ ముఖద్వారం రావులపాలెంకు ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’ అవార్డు రేపు ధర్మవరం, పుట్టపర్తిలలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటన * స్వచ్ఛభారత్, చెక్కుల పంపిణీతో పాటు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్ర సత్య కుమార్ యాదవ్ ధర్మవరం/పుట్టపర్తి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే జారే... ... బ్రెజిల్‌లో తుది దశకు ఎన్నికల వేడి - చివరి టీవీ డిబేట్‌ను బహిష్కరించిన అధ్యక్షుడు లూలా గ్రామీణ క్రీడాకారుల ప్రతిభకు వేదికగా ఆత్మకూరు క్రీడావికాస కేంద్రం అటార్నీ జనరల్ రోజర్ మారియాకా అరెస్ట్, డ్రగ్స్ అక్రమ రవాణా ఆరోపణలు వైసీపీ నుంచి టీడీపీ లోకి భారీ చేరికలు .....పదవుల కోసం కాదు... చిన్న శ్రీను వెంటే...... 1998 తర్వాత గరిష్ట స్థాయికి గిల్ట్ ఈల్డ్స్, కుప్పకూలిన బ్యాంకుల షేర్లు 30వ వార్డు సమస్యలపై శిరీషా ఫోకస్

పాయకరావుపేట మెయిన్‌రోడ్‌ విస్తరణ పనులకు శంకుస్థాపన.

Select Suryaa Now
పాయకరావుపేట మెయిన్‌రోడ్‌ విస్తరణ పనులకు శంకుస్థాపన.

 

రూ.8.20 కోట్ల విఎమ్ఆర్డిఏ నిధులతో సీసీ కాలువలు,కల్వర్టులు,సెంట్రల్‌ లైటింగ్‌ పనులకు శంకుస్థాపన చేసిన హోం మంత్రి అనిత.

పాయకరావుపేట అక్టోబర్‌ 1 మేజర్ న్యూస్.

పాయకరావుపేట పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి,అందంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు.పాయకరావుపేట మెయిన్‌రోడ్‌ విస్తరణలో భాగంగా సీసీ కాలువలు,కల్వర్టుల నిర్మాణం,సెంట్రల్‌ లైటింగ్‌ పనులకు గురువారం ఆమె శంకుస్థాపన చేశారు.విఎంఆర్డిఏ ఆధ్వర్యంలో రూ.8.20 కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి అనిత శ్రీకారం చుట్టారు.అభివృద్ధి పనులు పారదర్శకంగా,నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పాయకరావుపేట పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని,ఇందుకు పట్టణ ప్రజలు కూడా సహకరించాలని ఆమె కోరారు. పాయకరావుపేట టౌన్‌ను సుందరంగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని మంత్రి అనిత పేర్కొన్నారు.నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల సహకారం అవసరమన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు,విఎంఆర్డిఏ ఎస్‌ఈ ఎన్‌.రాంబాబు,డీఈ రామానాయుడు,ఏఈ లోకేష్‌ తదితరులు పాల్గొన్నారు.
పాయకరావుపేట మండల పరిధిలో నూతనంగా ఎన్నికైన ఎస్ఎంసి చైర్మన్ లకు హోం మంత్రి అనిత సన్మానం చేశారు.ఎస్ఎంసి చైర్మన్లు పాఠశాలలు అభివృద్ధి చేయడంలో పోటీ పడాలన్నారు.పాఠశాలల్లో ఆర్ ఓ ప్లాంట్ లు లేని చోట,ఆర్ ఓ ప్లాంట్ లు ఏర్పాటు చేస్తామన్నారు.ఆర్ ఓ ప్లాంట్లో ఉన్నచోట రిపేర్లు చేయిస్తామని చెప్పారు.