BREAKING
భారత్‌లో ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తున్న పెప్సికో, మాన్స్టర్ వెనిజులాలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్న ఐఎంఎఫ్ స్పష్టీకరణ ఇజ్రాయెల్ సెటిలర్ల కాల్పుల్లో పాలస్తీనా వ్యక్తి మృతి కోనసీమ ముఖద్వారం రావులపాలెంకు ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’ అవార్డు రేపు ధర్మవరం, పుట్టపర్తిలలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటన * స్వచ్ఛభారత్, చెక్కుల పంపిణీతో పాటు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్ర సత్య కుమార్ యాదవ్ ధర్మవరం/పుట్టపర్తి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే జారే... ... బ్రెజిల్‌లో తుది దశకు ఎన్నికల వేడి - చివరి టీవీ డిబేట్‌ను బహిష్కరించిన అధ్యక్షుడు లూలా గ్రామీణ క్రీడాకారుల ప్రతిభకు వేదికగా ఆత్మకూరు క్రీడావికాస కేంద్రం అటార్నీ జనరల్ రోజర్ మారియాకా అరెస్ట్, డ్రగ్స్ అక్రమ రవాణా ఆరోపణలు వైసీపీ నుంచి టీడీపీ లోకి భారీ చేరికలు .....పదవుల కోసం కాదు... చిన్న శ్రీను వెంటే...... 1998 తర్వాత గరిష్ట స్థాయికి గిల్ట్ ఈల్డ్స్, కుప్పకూలిన బ్యాంకుల షేర్లు 30వ వార్డు సమస్యలపై శిరీషా ఫోకస్ కిల్‌సెక్ హ్యాకర్ గ్రూప్ 16 ఏళ్ల లీడర్‌ను అరెస్ట్ చేసిన స్పానిష్ పోలీసులు కోనసీమ వాసుల దశాబ్దాల కలకు ఊతం.. నోటీస్ ఇవ్వకుండానే భూమి బదలాయింపు ఎలా? * తీవ్ర అన్యాయం జరిగిందంటూ భావిశెట్టి శేఖర్ ఆరోపణ

పాకెట్ మనీ పొదుపే సేవా మార్గం.

Select Suryaa Now
పాకెట్ మనీ పొదుపే సేవా మార్గం.
  • 11 ఏళ్లుగా ఆకలి తీరుస్తున్న సాయి విద్యార్థులు.

పలాస, అక్టోబర్ 1,మేజర్ న్యూస్.

"సీలింగ్ ఆన్ డిజైర్స్" - కోరికలకు హద్దు, సేవకు మార్గం.

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సందేశాన్ని ఆచరణలో చూపుతున్నారు పలాస విద్యార్థులు.పలాస మండలం రామకృష్ణాపురంలోని శ్రీ సత్యసాయి విద్యావిహార్ విద్యార్థినీ విద్యార్థులు గత 11 సంవత్సరాలుగా తమ పాకెట్ మనీని పొదుపు చేసి నారాయణ సేవ నిర్వహిస్తున్నారు. "అందరినీ ప్రేమించు - అందరినీ సేవించు" అనే స్వామి సందేశాన్ని తు.చ తప్పకుండా పాటిస్తున్నారు.

ప్రతి నెల ఒకటో తేదీన నారాయణ సేవ

తమ రోజువారీ ఖర్చులను తగ్గించుకుని మిగిల్చిన మొత్తంతో ప్రతి నెల 1వ తేదీన ఆహార ప్రసాద వితరణ చేస్తున్నారు. అందులో భాగంగా గురువారం అక్టోబర్ 1న పలాస రైల్వే కాలనీలో గల షిర్డీ సాయి మందిరం సమీపంలోని నిరుపేదలకు అన్న ప్రసాదం,స్వామివారి విభూతి, చిత్రపటాలను అందజేశారు.ఈ సేవా కార్యక్రమంలో నారాయణ సేవ ఇంఛార్జి దాలేటి సార్,విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.చిన్న వయసులోనే సేవా భావాన్ని అలవర్చుకుంటున్న విద్యార్థులను స్థానికులు అభినందిస్తున్నారు.