BREAKING
శ్రీ కోటదుర్గ ఆలయం లో గోడ పత్రిక విడుదల కొత్తపల్లి,రావుపల్లి గ్రామాల అంగన్వాడీ వర్కర్లకు సత్కారం మండల విద్యాశాఖ అధికారులకు ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించిన డీఈవో స్థానిక సంస్థల ఎన్నికలకు స్ట్రాంగ్ రూమ్ పరిశీలన తెగిపోయిన చేతికి మళ్లీ ప్రాణం… పీఎంశ్రీ పాఠశాలల్లో.. ప్రత్యేక అతిథి విద్యాబోధకుల నియామకం ఆటో ద్విచక్ర వాహనం ఢీ ఒకరికి గాయాలు.... చిగురుకోట జడ్పీ హైస్కూల్ ను పరిశీలించిన ఎస్ఎంసి చైర్మన్ దండే లక్ష్మి పాలకొండ శ్రీ కోట దుర్గమ్మ ఉత్సవ ఏర్పాట్ల పరిశీలన కనిగిరి చేరిన బ్యాలట్ బాక్స్ లు కోర్టు సినిమా హీరోయిన్ శ్రీదేవి కొత్త చిత్రం హైకూ ట్రైలర్ రిలీజ్.. అక్టోబర్ 23న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్! జోగింపేట గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించిన ఏవో ఎస్ అవినాష్ అయోడిన్ లోపంతో పిల్లల ఎదుగుదలపై ప్రభావం శ్రీ కోటదుర్గమ్మ ఆలయంలో వరుణయాగం వరిలో ఎద పద్ధతితో సాగు ఖర్చు తగ్గుతుంది ... ఏవో ఎస్ అవినాష్.

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం

Select Suryaa Now
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం
 సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి ;కామారెడ్డి: జిల్లాలో ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. మాతా-శిశు ఆరోగ్య పరిరక్షణ, వ్యాధుల నివారణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు.మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ సమీక్షా సమావేశంలో ఏప్రిల్ నుంచి ఆగస్టు 2026 వరకు శాఖ సాధించిన ప్రగతిని జిల్లా కలెక్టర్ సమీక్షించారు.జిల్లాలో అసంక్రమిత వ్యాధుల గుర్తింపు పరీక్షల్లో 88 శాతం ప్రగతితో రాష్ట్రంలో రెండో స్థానం సాధించడం అభినందనీయమన్నారు. రక్తపోటు నియంత్రణలో 54 శాతం, మధుమేహ నియంత్రణలో 58 శాతం ప్రగతి నమోదైనట్లు తెలిపారు. ఈ-సంజీవని ద్వారా ఆగస్టు నెలలో 36,916 టెలి వైద్య సంప్రదింపులు నిర్వహించి రాష్ట్రంలో మూడో స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు.జిల్లాలో సి-సెక్షన్ ప్రసవాల శాతం 67.5 శాతంగా ఉండటంపై కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 52.7 శాతం, ప్రైవేటు ఆసుపత్రుల్లో 87 శాతం సి-సెక్షన్లు జరుగుతున్నందున అనవసర శస్త్రచికిత్సలను నివారించేందుకు ప్రైవేటు ఆసుపత్రుల్లో తప్పనిసరిగా సి-సెక్షన్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. కామారెడ్డి ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ప్రాథమిక సి-సెక్షన్ కేసుల్లో ప్రతి కేసుకు పార్టోగ్రామ్‌ను సమర్థవంతంగా అమలు చేసి, అవసరమైన సందర్భాల్లో రెండో వైద్య అభిప్రాయం తీసుకోవాలని సూచించారు.
గర్భిణుల్లో రక్తహీనత నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, జిల్లాలో గుర్తించిన 4,213 మంది అధిక ప్రమాద గర్భిణులపై నిరంతర పర్యవేక్షణ, అనుసరణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెద్దకొడప్గల్, బాన్సువాడ, కామారెడ్డి ప్రాంతాల్లో వెనుకబడిన ఆరోగ్య సూచికల మెరుగుదలకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు.బాలికల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ఉద్దేశించిన హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఇంకా టీకా పొందని 5,451 మంది బాలికలకు పాఠశాలల వారీగా కార్యాచరణ రూపొందించి టీకాలు అందించాలని సూచించారు.డెంగ్యూ, టైఫాయిడ్ తదితర సీజనల్ వ్యాధుల నియంత్రణకు పంచాయతీరాజ్, పురపాలక శాఖలతో సమన్వయం చేసుకుని విస్తృతంగా పారిశుధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో మరింత నమ్మకం కలిగేలా వైద్యులు, వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు.వైద్య సేవలకు సంబంధించి ఏవైనా అవసరాలు, సమస్యలు లేదా అదనపు సమాచారం కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ)ను సంప్రదించాలని అధికారులు సూచించారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్ వై గిరి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకట్, కామారెడ్డి ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, బాన్సువాడ సూపరింటెండెంట్ శ్రీనివాస్, బీడబ్ల్యూఓ వెంకటేశ్వర్లు, వైద్యులు, అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.