BREAKING
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 103 ఫిర్యాదులు పోలీసులకు మూడు నూతన స్నిఫర్ డాగ్స్ కానిస్టేబుళ్లదే కీలక పాత్ర.. ప్రజలతో మర్యాదగా మెలగాలి బాల న్యాయ వ్యవస్థపై పోలీసులకు అవగాహన పోరంకి–కానూరుకు రూ.34.92 కోట్ల అభివృద్ధి పనులు.. తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు...జనతా పరివార్ పార్టీ అభ్యర్థుల ప్రకటన అభివృద్ధిని చూసి వైసీపీకి కడుపుమంట.. అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌.. రూ.5 లక్షల సొత్తు, రెండు కార్లు స్వాధీనం ఇంట్లో ఇనుపరాడ్‌తో భార్యపై దాడి మేయర్‌గా బొండా సిద్ధార్థకు అవకాశం కల్పించాలి వైభవంగా విజయవాడ ఉత్సవ్–2.. జాతీయస్థాయి కుంగ్ ఫూ కరాటే పోటీల్లో శ్రీ సత్య విద్యానికేతన్ విద్యార్థుల ప్రతిభ. గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి పల్లె పండుగ 3.0తో పల్లెలకు మహర్దశ - పి.గన్నవరంలో రూ.4.30 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గిడ్డి శంకుస్థాపన పత్తి రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి.

పట్టభద్రులంతా విధిగా ఓటు నమోదు చేసుకోవాలి

Select Suryaa Now
పట్టభద్రులంతా విధిగా ఓటు నమోదు చేసుకోవాలి

యూత్ కాంగ్రెస్ ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడు బొక్క సంజీవరెడ్డి

ఘట్‌కేసర్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 4):
మహబూబ్‌నగర్–హైదరాబాద్–రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఘట్‌కేసర్ డివిజన్ పరిధిలోని అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు తమ ఓటును విధిగా నమోదు చేసుకోవాలని యూత్ కాంగ్రెస్ ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడు బొక్క సంజీవరెడ్డి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పట్టభద్రుల ఓటు సాధారణ ఓటు కాదని, విద్యావంతుల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. పట్టభద్రులు, నిరుద్యోగులు, యువత సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించే నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సమ రామ్మోహన్‌రెడ్డికి మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు.గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టభద్రులు, నిరుద్యోగ యువత సమస్యలను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ప్రాధాన్యతనిస్తూ ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తోందన్నారు. అర్హత ఉన్న ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని బొక్క సంజీవరెడ్డి కోరారు.

రిపోర్టర్ గుర్రం రమేష్.