BREAKING
కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం: పీఠాధిపతి అరీఫుల్లా హుస్సేనీ ప్రత్యేక భేటీ! రాజధాని పనులపై నిర్మాణ సంస్థలతో సీఎం చంద్రబాబు సమీక్ష: 21 కి.మీ ఎత్తులో డీఆర్‌డీవో హై-ఆల్టిట్యూడ్ ఎయిర్‌షిప్ పరీక్ష విజయవంతం: దేశీయ హెచ్‌పీవీ వ్యాక్సిన్ ‘సెర్వావాక్’కు డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు... కెన్యాలో తొలి ఎబోలా కేసు నిర్ధారణ: చికిత్స పొందుతూ రోగి మృతి.. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ, డబ్ల్యూహెచ్‌వో! ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి :ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కు వినతిపత్రం పేదలకు ప్రయోజనం చేకూర్చే ‘మీ మార్ట్’ ప్రారంభం రామన్నపాలెంలో పంచాయతీ కార్యదర్శులు, హరిత రాయబారులకు శిక్షణ కార్యక్రమం పొలం సంఘం ది - రిజిస్ట్రేషన్ వేరొకరికి ...:ఈతకోట బాబా నగర్ కాలనీ వాసులు కలెక్టర్ కు ఫిర్యాదు నేటి రాశి ఫలాలు – 7 అక్టోబర్ 2026 (బుధవారం) మామునూరు ఎయిర్ పోర్టుకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలి నేటి పంచాంగం 7 అక్టోబర్ 2026,బుధవారం ఉర్సు రావణాసుర వధ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి గిరిజన చట్టాలకు తూట్లు

పల్లె పండుగ 3.0తో పల్లెలకు మహర్దశ - పి.గన్నవరంలో రూ.4.30 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గిడ్డి శంకుస్థాపన

Select Suryaa Now
పల్లె పండుగ 3.0తో పల్లెలకు మహర్దశ - పి.గన్నవరంలో రూ.4.30 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గిడ్డి శంకుస్థాపన

 అంబాజీపేటమేజర్ న్యూస్ :పల్లె పండుగ 3.0తో గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. అంబాజీపేట మండలం మోసలపల్లి చింతాలమ్మ ఆలయం వద్ద రూ.49 లక్షల బీటీ రోడ్డు, మాచవరం కొర్లపాటివారిపాలెం వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద రూ.10 లక్షల సీసీ రోడ్డు పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి మాట్లాడుతూ గ్రామాలే రాష్ట్ర అభివృద్ధికి పునాదులు. గ్రామీణ మౌలిక వసతులు, రైతు సంక్షేమం, పారిశుధ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధికి చిరునామాగా మారుస్తాం అన్నారు. పి.గన్నవరం నియోజకవర్గానికి పల్లె పండుగ 3.0లో 41 పనులు, రూ.4.30 కోట్లతో 7 కి.మీ రోడ్లు మంజూరయ్యాయి. ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తా అని అన్నారు. అలాగే పలువురు కూటమి నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే కృషితో నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతోందని పల్లె పండుగ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు మెరుగుపడుతున్నాయి.

 కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉంది" అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి‌కో కన్వీనర్ డివివి సత్యనారాయణ,రాష్ట్ర డైరెక్టర్ లు  బొంతు పెదబాబు,శిరిగినీడి వెంకటేశ్వరరావు,మట్టపర్తి బాల భారతి,సొసైటీ చైర్ పర్సన్ అరిగెల సూరిబాబు, ఎఎమ్ సి వైస్ చైర్మన్ కొర్లపాటి వెంకటేశ్వరరావు, ఎంపిడిఓ బి.మమత,ఎపిఓ ఎ.వెంకట కృష్ణ,మాజీ ఎంపిపి దొమ్మేటి వెంకటేశ్వరరావు,కూటమి నాయకులు అరిగెల బలరామమూర్తి, నాగాబత్తుల సుబ్బారావు, రవణం రాము, టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు పెదపూడి శ్రీనివాస్, సుంకర బాలాజీ,కొర్లపాటి గోపి, ఎమ్.తాతాజీ,నాయకులు, అదికారులు తదితరులు పాల్గొన్నారు.