telanagana
మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత.
సూర్య సారంగాపూర్ ;ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.మంగళ వారం సారంగాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పంపిణీ చేశారు.అనంతరం సారంగాపూర్ మండల కేంద్రంలో రూ.10 లక్షల నిధులతో నిర్మించనున్న జాగృతి మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ భూమిపూజ చేశారు. అనంతరం గ్రామంలో రూ.10 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ,రామాలయం వద్ద 3 లక్షల నిధులతో నిర్మించనున్న మరుగుదొడ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం సారంగాపూర్,నాయకపు గూడెం గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన డీటీఆర్ ల ను ఆయన ప్రారంభించారు.మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో సారంగాపూర్ మండలానికి మంజూరైన 13 మందికి కల్యాణలక్ష్మి పథకం ద్వారా మంజూరైన 13 లక్షల రూపాయల చెక్కులను, 28 మందికి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా మంజూరైన 10 లక్షల 70 వేల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందించారు.ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. మహిళా సంఘాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు రహదారులు, విద్యుత్ తదితర సౌకర్యాలను మెరుగుపరుస్తున్నామని పేర్కొన్నారు.
ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్తూ సారంగాపూర్ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు.ఇందిరమ్మ ఇళ్లు మంజూరు తో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొందన్నారు.గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులకు సర్పంచుల కు కాంట్రాక్టర్ లకు ఇప్పుడుబిల్లులు చెల్లిస్తున్నాం.రోళ్ళవాగు ప్రాజెక్ట్ కి 40 కోట్ల మంజూరు చేశామన్నాడు.అటవీ అనుమతులు కోసం కృషి చేస్తున్నామని అన్నారు.బీర్పూర్ ఘాట్ రోడ్డు డబల్ రోడ్డు మంజూరు అయిందనీ, అటవీ అనుమతులు రావాల్సి ఉందన్నారు.తెలంగాణ రాష్ట్రంలో సామాన్య ప్రజల కోసం ప్రభుత్వం పని చేస్తుంది అన్నారు.అత్యధిక వర్షాలు జిల్లాలో సారంగాపూర్ లో నమోదు అయ్యాయన్నారు.ప్రకృతి కి ఎవరు అతీతులు కాదనీ,రైతులు ఆరుతడి పంటలు సాగు వైపు మొగ్గు చూపాలన్నారు.వర్షాలు లేక నీటి వనరులు ప్రాజెక్ట్ లలో నీరు లేక విద్యుత్ ఉత్పత్తి తగ్గిందన్నారు.ధరల పెరుగుదల కు ముఖ్యమంత్రికి సంబంధం ఏంటనీ అన్నారు.కావాలని ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారు.బట్టకాల్చి మీద పడేసే విదంగా ప్రయత్నం చేస్తున్నారు.మెడికల్ కాలేజీ నిర్మాణం తో అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నాం,నాణ్యమైన విద్య వైద్యానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అటానమస్ లో నూతన విద్యా కోర్సులు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.గత ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ది పథకాలు అమలు చేస్తూ నూతన పథకాలు ప్రవేశ పెడుతూ ప్రజలకు పథకాలు అమలు చేయడం జరుగుతుంది అన్నారు.రాష్ట్రంలో ఎక్కడాలేని విదంగా 12 ఏండ్ల నుండి అత్యధిక సీఎం సహాయ నిధి చెక్కులు జగిత్యాల నియోజకవర్గం లో పంపిణీ చేస్తున్నాం అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు చేకూట అరుణ శేఖర్ యాదవ్,, పుష్ప నాథ్,మండల సర్పంచుల ఫోరం సొల్లు సురేందర్,పాక్స్ చైర్మెన్ లు మల్లారెడ్డి ,నరసింహ రెడ్డి, పాక్స్ వైస్ చైర్మన్ బాపిరాజు,ఎంపీడీఓ సలీం, డిప్యూటీ తహసీల్దార్ సుమతి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మనోహర్ రెడ్డి, సర్పంచులు కొలపాక రాధా రాజు, అశ్విని రమేష్, పద్మ శ్రీనివాస్, మాధవి బాపురాజ్, పుష్ప రాజ్, మాజీ ఎంపీపీ కోల శ్రీనివాస్,మాజీ సర్పంచ్ రాజేందర్ రెడ్డి,సర్పంచులు,ఉప సర్పంచులు, మాజీ సర్పంచులు అధికారులు, మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.