BREAKING
విజయవాడ ఉత్సవ్ 2.0, దసరా వేడుకలకు కేంద్ర రైల్వే మంత్రికి ఆహ్వానం బ్రస్సెల్స్ విమానాశ్రయంలో శుక్రవారం విమానాల రద్దుకు ఏర్పాట్లు ఆర్టీసీ బస్సు–టాటా మ్యాజిక్ ఢీ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు: సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పలికిన ఆలయ ధర్మకర్తల మండలి, అధికారులు! పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజాపాలనపరివేద గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ పనీర్ vs సోయా చంక్స్.. బరువు తగ్గాలనుకునేవారికి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా? విజయ మహిళా మండలికి స్వచ్ఛత ఆంధ్ర అవార్డు మానవత్వం చాటుకున్న శాలపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కవ్వాల్ అడవుల్లో విద్యార్థుల సందడి భారతీయ జ్ఞాన సంపదపై అవగాహన కార్యక్రమాలు రైతులకు రాయితీపై అందుబాటులో శనగ విత్తనాలు బాక్సాఫీస్ వద్ద దృశ్యం 3 సునామీ.. ఐదో రోజుకే 220 కోట్ల మార్క్ దాటేసిన అజయ్ దేవగన్ చిత్రం! ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. : రంగారెడ్డి డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి

వర్మీ కంపోస్ట్ తయారీపై ఎంపీడీవో ఆఫీసులో శిక్షణా కార్యక్రమం

Select Suryaa Now
వర్మీ కంపోస్ట్ తయారీపై ఎంపీడీవో ఆఫీసులో శిక్షణా కార్యక్రమం
  • ఎంపీడీవో నడిమింటి సూర్యనారాయణ వెల్లడి
  • సూపరింటెండెంట్ నాలి అర్జునరావు తదితరులు

గరుగుబిల్లి: గ్రామ పంచాయతీలను స్వచ్ఛమైన మరియు పర్యావరణహిత గ్రామాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో, గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు (పంచాయతీ అభివృద్ధి అధికారులకు), గ్రీన్ అంబాసిడర్లకు వర్మీకంపోస్ట్ (వానపాముల ఎరువు) తయారీపై ప్రత్యేక అవగాహన మరియు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మండల పరిషత్ అభివృద్ధి అధికారి నడిమింటి సూర్యనారాయణ పేర్కొన్నారు.మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో మంగళవారం గ్రామ పంచాయతీల్లో వర్మీకంపోస్ట్ తయారీపై గ్రీన్ అంబాసిడర్లు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణా కార్యక్రమమును నిర్వహించారు.ఈసందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి నడిమింటి సూర్యనారాయణ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో సేంద్రియ ఎరువుల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా ఈశిక్షణను ఏర్పాటు చేశామన్నారు.గ్రామాల్లో సేకరిస్తున్న తడి చెత్త, కూరగాయల వ్యర్థాలు, మరియు పేడను వానపాములు, ఉపయోగకరమైన సూక్ష్మజీవుల సహాయంతో కుళ్ళింపజేసి నాణ్యమైన సేంద్రియ ఎరువుగా ఎలా మార్చాలో ప్రాక్టికల్ పద్ధతిలో వివరించారు.తడి చెత్తను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా పల్లెల్లో పరిశుభ్రత పెరగడమే కాకుండా, ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన బలమైన వర్మీకంపోస్ట్‌ను సొంతంగా తయారు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.ఈ శిక్షణలో వర్మీ బెడ్‌లను ఎలా ఏర్పాటు చేయాలి, తేమ శాతాన్ని ఎలా కాపాడుకోవాలి, వానపాముల రక్షణ మరియు ఎరువును సేకరించే విధానాలపై గ్రీన్ అంబాసిడర్లకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం సూపరింటెండ్ నాలి అర్జునరావు,పంచాయతీ కార్యదర్శులు బంటు అప్పారావు,సూరు శ్రీనివాసరావు,తిరుపతి భాస్కరరావు,రంభ శశిభూషణరావు, నీరస రవికుమార్,మరడాన భార్గవ్ కుమార్, అడ్డూరి లలితకుమారి,ఎస్ శ్రీలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.