మలక్పేటలో దివ్యాంగుల నిరసన
పాతబస్తీ మలక్పేటలోని దివ్యాంగుల కమిషన్ కార్యాలయం ఎదుట దివ్యాంగుల మహిళా సాధికారత సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. దివ్యాంగులకు కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఖాళీగా ఉన్న ఉన్నతాధికారుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బ్యాక్లాగ్ ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించాలని, స్వయం ఉపాధి రుణాలు, సహాయ ఉపకరణాలు, వివాహ ప్రోత్సాహక నిధులు వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఈ నిరసనలో వివిధ సంఘాల నాయకులతో పాటు సుమారు 100 మంది దివ్యాంగులు పాల్గొన్నారు.