BREAKING
సర్వర్ డౌన్‌తో భూముల రిజిస్ట్రేషన్లకు బ్రేక్‌! సమైఖ్య పదం చాలా బలమైనది.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు కరెంటు కోతలతో రోడ్డెక్కిన రైతన్న. ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ఇంకొల్లు ఎస్సై వినోద్‌ మహా చండీ దేవిగా అమ్మవారి దర్శనం జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక పరిణామం.. పూలనే దేవతగా పూజించే పండుగ “బతుకమ్మ” - జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి. శారదాదేవి 121 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చట్టప్రకారమే ఎన్నికల ప్రక్రియ: మంత్రి నారాయణ పింక్ టాయిలెట్స్‌కు అహుడా శ్రీకారం!.. అనంతపురంలో రూ.30 లక్షలతో నిర్మాణం జనాభా లెక్కల్లో ఈ ద్వంద్వ ప్రమాణాలేంటి? కాసేపట్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల గంగానదిలో ఘోర ప్రమాదం: పడవ బోల్తా పడి 13 మంది చిన్నారులు జలసమాధి.. రాఘోపూర్‌లో విషాదం! ఎన్నికల వేళ పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయాలి సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలి జిల్లా ఎస్పీ పి. జగదీష్‌ సంతమాగులూరు నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఏ. బాలకృష్ణ

ఇర్విన్ లో డిఎల్ఐ రిజర్వాయర్ రద్దుకై ఆందోళన ఉధృతం చేస్తాం

Select Suryaa Now
ఇర్విన్ లో డిఎల్ఐ రిజర్వాయర్ రద్దుకై ఆందోళన ఉధృతం చేస్తాం

*మూడు గ్రామాల పేద రైతులను భూనిర్వాసితులను చేసే రిజర్వాయర్ రద్దుకై ఇప్పటికే రైతులతో కలిసి గత, ప్రస్తుత ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నపించాం*

*ఇర్విన్ రిజర్వాయర్ రద్దు చేయాలన్న డిమాండ్ తో ఈనెల 17న రైతుల మహాధర్నా*

*వివరాలు వెల్లడించిన ఇర్విన్ మాజీ సర్పంచ్ రాజమోని పుష్పలతజంగయ్య యాదవ్*

మాడ్గుల మండలం ఇర్విన్ రెవెన్యూ శివారులో ఇర్విన్ నల్లజెర్వు, అజిలాపూర్ గ్రామాలకు చెందిన సుమారు 1100 ఎకరాల పేద రైతుల భూముల్లో నిర్మించతలపెట్టి డిండి లిఫ్ట్ ఇరిగేషన్ రిజర్వాయర్ ను రద్దుచేసి రైతులను ఆదుకోవాలని గత బిఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు రైతులతో కలిసి విన్నపిస్తున్నా గాని పేద రైతుల పట్ల ఉదాసీనతగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ఇర్విన్ మాజీ సర్పంచ్ రాజమోని పుష్పలతజంగయ్య యాదవ్ అన్నారు.ప్రభుత్వం  బలవంతంగా రిజర్వాయర్ నిర్మిస్తే ప్రధానంగా మూడు గ్రామాల పేదరైతులకు ఉన్న ఎకరా, రెండెకరాల భూములు ముంపుకు గురై వారి కుటుంబాలు రోడ్డునపడతాయని మాజీ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ మేరకు బుధవారం పుష్పలత జంగయ్యయాదవ్ మాట్లాడుతూ పేద రైతులతో పాటు వందలాది మంది కల్లుగీతా కార్మికులను నిరాశ్రయులను చేసే డిఎల్ఐ రిజర్వాయర్ నిర్మాణ యోచనను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకొని ఈ ప్రాంత చెరువుల్లో డిఎల్ఐ కాలువల ద్వారా నీటిని అందించాలని కోరారు. రిజర్వాయర్ రద్దు చేయాలన్న డిమాండ్ తో పాలమూరు పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల సాధన జెఏసి ఆధ్వర్యంలో ఈనెల 17న భూనిర్వాసిత రైతులు, ప్రజలతో కలిసి కల్వకుర్తి తహసీల్ధార్ కార్యాలయం ఎదుట మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మాజీ సర్పంచ్ వివరించారు. ఈ ధర్నా కు మూడు గ్రామాల రైతులతో పాటు పార్టీలు, సంఘాలకతీతంగా నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని పుష్పలతజంగయ్య యాదవ్ కోరారు.

---------

-ఆర్.నర్సింహ్మ, మేజర్ న్యూస్: మాడ్గుల