పింక్ టాయిలెట్స్కు అహుడా శ్రీకారం!.. అనంతపురంలో రూ.30 లక్షలతో నిర్మాణం
(అనంతపురం మేజర్ న్యూస్ ప్రతినిధి )అనంతపురం నగరంలో మహిళల భద్రత, ఆత్మగౌరవం, పారిశుధ్యానికి ప్రాధాన్యతనిస్తూ అహుడా ఆధ్వర్యంలో రూ.30 లక్షలతో పింక్ టాయిలెట్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. క్లాక్ టవర్ సమీపంలోని ప్రెస్ క్లబ్ ఎదురుగా ఫ్లైఓవర్ కింద ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్, ఎమ్మెల్సీ దళవాయి రమాదేవితో కలిసి అహుడా ఛైర్మన్ టీసీ వరుణ్ భూమి పూజ నిర్వహించారు. మహిళలు, విద్యార్థినులు, ఉద్యోగినులకు ఆధునిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని టీసీ వరుణ్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో నగరాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని వరుణ్ అన్నారు.
( మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్)