ఆపదలో ఉన్న ప్రాణానికి సీఎం సహాయనిధి సంజీవని.
పేదరికంలో ఉన్నవారికి ప్రాణదానం చంద్రబాబు ధ్యేయం.
45 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి.
సూర్య న్యూస్ దర్శి.
ఆపదలో ఉన్న ప్రాణానికి సీఎం సహాయనిది సంజీవన లాంటిదని రూపాయి ఖర్చు లేని వైద్యం ప్రజలకు అమ్మ చేయాలన్నది చంద్రబాబు ధ్యేయం అని నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు. దర్శి టిడిపి కార్యాలయం నందు 83 మంది లబ్ధిదారులకు రూ.45,44,427 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలు వైద్య ఖర్చుల కోసం అప్పుల పాలుకాకూడదనే ఉద్దేశంతో, అవసరమైన సమయంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. ప్రజల కష్టాల్లో తోడుగా నిలిచి, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల సహకారం ఉండాలని డాక్టర్ లక్ష్మి కోరారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గం లోని మండల మరియు టౌన్ టిడిపి అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, మోడీ ఆంజనేయులు, మేడగం వెంకటేశ్వర రెడ్డి, పిడతల నేమిలయ్య, పుల్లలచెరువు సత్యనారాయణ, నియోజకవర్గం లోని వివిధ హోదాల్లో ఉన్న టిడిపి నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.