BREAKING
యాసంగిలో వరి సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం నాట్ ఫర్ సేల్’ పాస్‌లను ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వేదికగా భారీ ధరకు విక్రయం:హెచ్‌సిఎ సభ్యులు అరెస్ట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విందూ ఆతిథ్యం.. ఫౌజీ హీరోయిన్ ఇమాన్వి బర్త్‌డేకి అదిరిపోయే సర్ప్‌రైజ్! వచ్చే దసరా నాటికి మొదటి దశ ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేస్తాం- ఐశ్వర్యా రాయ్‌తో యాడ్ షూటింగ్ అనుభవం.. భావోద్వేగానికి లోనైన చైల్డ్ ఆర్టిస్ట్ సోషల్ మీడియా పోస్ట్! వాల్మీకిలను సత్వరమే ఎస్టీ జాబితాలో చేర్చాలి ఎంపీటీసీ రిజర్వేషన్లలో దళితులకు అన్యాయం రాహుల్‌ గాంధీ దిష్టిబొమ్మ దహనయత్నం:అడ్డుకున్న తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు! వెల్దుర్తి మండలంలో మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వాటి వివరాలు మరియు రిజర్వేషన్లు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ పంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు స్థానిక షెడ్యూల్ వచ్చేసింది.. గాయత్రీ దేవిగా దర్శనమిచ్చిన బాల త్రిపుర సుందరీ దేవి నాలుగో రోజు దుర్గామాతకు పూజలు అద్దంకి విద్యుత్తు ఈఈ మస్తాన్ రావుకు SE గా పదోన్నతి

పాల్మాకుల్‌లో మహిళ అనుమానాస్పద మృతి

Select Suryaa Now
పాల్మాకుల్‌లో మహిళ అనుమానాస్పద మృతి

శంషాబాద్ : మండల పరిధిలోని పాల్మాకుల్ గ్రామంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామానికి చెందిన సుజాత (44) బుధవారం ఉదయం మృతి చెందినట్లు సమాచారం.

వివరాల్లోకి వెళితే.. సుజాత గత ఏడాది కాలంగా మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఆమె భర్త తెలిపాడు. ఎర్రగడ్డ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మందులు వాడుతున్నట్లు పేర్కొన్నాడు. ఆమెకు కల్లు తాగే అలవాటు ఉందని, వైద్యులు కల్లు తాగవద్దని సూచించినప్పటికీ అప్పుడప్పుడు తాగేదని తెలిపాడు.

బుధవారం ఉదయం నిద్రపోతున్న సుజాతను ఎంతసేపటికీ పిలిచినా స్పందించకపోవడంతో చుట్టుపక్కల వారిని పిలిచాడు. పరిశీలించగా ఆమె మృతి చెందినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న శంషాబాద్ రూరల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మహిళ మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

పోతుల నర్సింహా, మేజర్ స్యూస్ శంషాబాద్.