BREAKING
ఎంపిపి, జెడ్పీటీసీ, ఎంపిటిసి ల రిజర్వేషన్ లు ఖరారు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లతో మరో సినిమా తీయడమే నా చివరి కోరిక.. కరణ్ జోహార్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఎముకల దృఢత్వానికి బీన్స్ చేసే మేలు.. అవసరమైన ముఖ్యమైన పోషకాలు ఇవే! పుల్లలచెరువు మండలంలో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ బ్లాక్‌బస్టర్ ది ఒడిస్సీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? చిన్నగంజాం ఎస్‌ఐ సురేష్‌కు ఎమ్మెల్యే ఏలూరి శుభాకాంక్షలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సుకుమార్ ఆర్సీ 17 కొత్త ఆఫీస్ పూజా కార్యక్రమాలు పూర్తి! శాంతియుత వాతావరణానికి ప్రజల సహకరించాలి కేటిఆర్ తో మురళీకృష్ణ యాదవ్ మూలాఖాత్ కిరాతక భార్య, ప్రియులకు ఉరిశిక్ష ట్యాంకర్ల నీటితో వరి పంటను కాపాడుకుంటున్న రైతు జాతీయ స్థాయి క్రీడలకు ఆర్ కె విద్యార్థిని ఎంపిక బెజ్జుర్‌లో భక్తిశ్రద్ధలతో నాలుగో రోజు పూజలు - అన్నదాన వితరణ 4వ రోజుకు చేరిన సాయిబాబా ఆరాధన ఉత్సవాలు నెల్లూరు నగరంలో దూకుడు పెంచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ..

ఎంపీటీసీ రిజర్వేషన్లలో దళితులకు అన్యాయం

Select Suryaa Now
ఎంపీటీసీ రిజర్వేషన్లలో దళితులకు అన్యాయం

వెల్దుర్తి, సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్:స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ రిజర్వేషన్లలో దళితులను రాజకీయంగా అణగదొక్కడానికి కొంతమంది మండల స్థాయి అధికారులు కుట్ర పన్నుతున్నారని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాదిపోగు నవీన్ మాదిగ ఆరోపించారు. బుధవారం వెల్దుర్తిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.వెల్దుర్తి గ్రామ జనాభాలో దళితులు 30 శాతం ఉన్నప్పటికీ, ఎంపీటీసీ రిజర్వేషన్ల కేటాయింపులో వారికి తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. అధికారులు ఉద్దేశపూర్వకంగానే దళితులను రాజకీయంగా ఎదగకుండా అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రిజర్వేషన్ల కేటాయింపులో జరిగిన ఈ అన్యాయంపై ఏపీ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు టైలర్ రాముడుతో పాటు వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సూర్యా ప్రతినిధి షేక్ దస్తగిరి కర్నూల్ జిల్లా వెల్దుర్తి మండలం