శాంతియుత వాతావరణానికి ప్రజల సహకరించాలి
సూర్య న్యూస్ ముండ్లమూరు.
త్వరలో జరగబోవు స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజల సహకరించాలని ఎస్ ఐ కోటేశ్వరరావు కోరారు. మండలంలోని మారెళ్ళ గంగన్న పాలెం జమ్మలమడక మక్కినవారిపాలెం గ్రామాలలో పోలింగ్ బూత్ ల ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ చిన్న చిన్న విషయాలకు గొడవలు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని తాము గొడవల్లో పడటం వలన తమ బిడ్డల జీవితం కూడా నాశనం అవుతుందని దానిని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. గ్రామాల్లోని ప్రజలందరూ సోదరుభావంతో ఐకమత్యంతో కలిసి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని ఆయన కోరారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు వచ్చినట్లయితే తమకు సమాచారం అందించాలని ప్రజలను ఎస్సై కోటేశ్వరావు కోరారు