చిన్నగంజాం ఎస్ఐ సురేష్కు ఎమ్మెల్యే ఏలూరి శుభాకాంక్షలు
చిన్నగంజాం : చిన్నగంజాం ఎస్ఐగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ బుధవారం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేశారు. నూతన బాధ్యతల్లో ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణకు అంకితభావంతో కృషి చేయాలని ఎమ్మెల్యే ఏలూరి ఆకాంక్షించారు.