వాలంటీర్ టీచర్లకు సర్టిఫికెట్లు పంపిణీ.
సూర్య న్యూస్ దర్శి.
అక్షరాంధ్ర కార్యక్రమంలో వాలంటరీ టీచర్లుగా పనిచేసిన వారికి జిల్లా కలెక్టర్ జారీ చేయబడిన ప్రశంస ధ్రువపత్రాలను పంపిణీ చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో.. ఎంపిడిఓ పి. కల్పన చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. మెప్మా సిఎంఎం రఘు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మున్సిపాలిటీ పరిధిలోని అన్ని సచివాలయాల పరిధిలో స్వచ్ఛంద ఉపాధ్యాయులకు అందజేశారు. ఈ సందర్భంగా వయోజన విద్య సూపర్వైజర్ వై. చౌడి రెడ్డి మాట్లాడుతూ మొదటి విడత అక్షరాంధ్ర కార్యక్రమంలో పని చేసిన వాలంటీర్లకు అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం అమలవుతున్న విడతలోనూ రెట్టించిన స్ఫూర్తితో.. ఉత్సాహంతో పని చేయాలని కోరారు. 160 మందికి సర్టిఫికెట్లు లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఓలు రవీంద్ర, కోటేశ్వరరావు, పలువురు ఆర్పీలు పాల్గొన్నారు.