4వ రోజుకు చేరిన సాయిబాబా ఆరాధన ఉత్సవాలు
భట్టిప్రోలు, మేజర్ న్యూస్: భట్టిప్రోలు గ్రామంలో వేంచేసి యున్న శ్రీ షిరిడి సాయి, దత్తాత్రేయ స్వామి వారి దేవాలయంలో శ్రీ షిరిడి సాయిబాబా వారి 108వ ఆరాధనో త్సవాల సందర్భంగా శ్రీ బాబా వారికి బుధవారం కలసాభిషేకంను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అభిషేకంను తూనుగుంట్ల వంశీకృష్ణ-మానస లక్ష్మి, ఎనుమల సుందర నాడార్-శివపార్వతి, మాదాల ప్రవీణ్ రాజు-సుధారాణి, గొడవర్తి మనోజ్ బాలాజీ, మెడ తాటి రూప పనింద్ర, వాసి శ్రీనివాసరావు-రుక్మిణి కుమారిలు స్వామివారికి కలశాభిషేకాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాలను దేవస్థాన అధ్యక్షులు తమ్మన రమేష్ బాబు, ఉపాధ్యక్షులు బట్టు రమేష్ బాబు, చెన్నగిరి రాంబాబు, కార్యనిర్వాహక కార్యదర్శి జవాది వెంకటేశ్వరరావు, కోశాధికారి బూరెల కిరణ్ కుమార్, ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు తడవర్తి అర్ధనారీశ్వరుడు, చందలూరు రామకోటేశ్వరరావు, దేవస్థాన కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. అభిషేకాధి కార్యక్రమాలను దేవస్థాన ప్రధాన అర్చకులు మురికిపూడి దుర్గాప్రసాద్ శర్మ జరిపించారు.