ఎంపిపి, జెడ్పీటీసీ, ఎంపిటిసి ల రిజర్వేషన్ లు ఖరారు
రేగిడి, సూర్య : మండలానికి సంబంధించి ఎంపిపి, జెడ్పీటీసీ, ఎంపిటిసి స్థానాల రిజర్వేషన్ లు ఎన్నికల కమిషన్ బుధవారం ఖరారు చేసింది..ఎంపిపి స్థానం అన్ రిజర్వుడు కేటాయించగా, జెడ్పీటీసీ స్థానాన్ని బిసి మహిళకు కేటాయించారు. 20 ఎంపిటిసి స్థానాలకు గాను నాయిరాలవలస బిసి, రేగిడి బిసి మహిళ, కందిశ, లింగాల వలస, అంబఖండి, లక్ష్మి పురం, సంకిలి స్థానాలు అన్ రిజర్వడ్, సోమరాజు పేట, బూరాడ, మునకలవలస, కోడిశ స్థానాలు జనరల్ మహిళ, పారంపేట, దేవుదల, కొమిరి స్థానాలు బిసి,ఖండ్యాం ఎస్ సి, పెదశిర్లాం బిసి మహిళ, ఉంగరాడ జనరల్ మహిళ, తునివాడ ఎస్ సి మహిళ, అంబాడ బిసి మహిళ, ఉనుకూరు బిసి మహిళ కు కేటాయించారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. పోటీ చేయడానిడి ఆసక్తి ఉన్న వారంతా టికెట్ల కోసం ఎవరి ప్రయత్నాలు వారు మొదలు పెట్టారు.
రిపోర్టర్ : రాము నాయుడు, రేగిడి, విజయనగరం జిల్లా.