BREAKING
చైనా వాణిజ్య సంబంధాలపై యూరోపియన్ యూనియన్ కీలక ప్రకటన భారతదేశంలో మారుతున్న జనాభా పరిస్థితులపై సిడార్ ఆధ్వర్యంలో చర్చాగోష్ఠి వాలంటీర్ టీచర్లకు సర్టిఫికెట్లు పంపిణీ. బాలికలు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ నిహారిక మెగా నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన... 250 మంది రోగులుకు వైద్య సేవలు కుల,ఆదాయ ధ్రువీకరణ పత్రాలు రాక ఆందోళన శిక్షణతోనే ఆగదు... పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి మంత్రి సుభాష్ అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు లయన్స క్లబ్‌ ఆద్వర్యంలో కంటి పరీక్షలు మాజీ ఎంపిటిసి జిలాని వైసీపి వీడి టిడిపి లో చేరిక విజయ్ నగర్ కాలనీలో ఘనంగా చండీ యాగం.. రిజర్వేషన్లతో గ్రామాల్లో రాజకీయ వేడి.... బాడంగి జడ్పీటీసీ ఎస్సీ మహిళకు.. ఎంపీపీ పీఠం బీసీకి కేశంపేట మండలంలో గంజాయి లభ్యం.... బాన్సువాడ ఏరియా ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం .. గర్భిణీ కడుపులోని శిశువు మృతి పూసపాటి రేగ మండల పీఠం పై పలువురు గురి *జనసేన తరపున కోట్లకే ఎమ్మెల్యే ఆశీస్సులు..?

నెల్లూరు నగరంలో దూకుడు పెంచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ..

Select Suryaa Now
నెల్లూరు నగరంలో దూకుడు పెంచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ..

నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్ :   కార్పొరేషన్ ఎన్నికల్లో 70వ డివిజన్ అభ్యర్థిగా భాగి వెంకటరమణ గారి పేరును ప్రకటించిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ఈ సమావేశానికి  భారీ సంఖ్యలో హాజరైన..పార్టీ నాయకులు,కార్యకర్తలు  నెల్లూరు రాంజీ నగర్‌లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో 70వ డివిజన్ వైసిపి నాయకులు, కార్యకర్తలతో..వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి  సమన్వయ సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా  కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కార్పొరేషన్ ఎన్నికలకు సంబందించి..70వ డివిజన్ అభ్యర్థిగా భాగి వెంకటరమణ.  ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి .. ప్రకటించారు. 

దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.  కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని చంద్రశేఖర్ రెడ్డి సూచించారు.  70వ డివిజన్‌లో  అందరూ సమష్టిగా పనిచేసి భాగి వెంకటరమణను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని  పార్టీ నాయకులు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు. మరోసారి 70వ డివిజన్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా నిలబెడతామని తెలిపారు.