కేటిఆర్ తో మురళీకృష్ణ యాదవ్ మూలాఖాత్
కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన షాద్‌నగర్ బీఆర్ఎస్ యువ నాయకుడు మురళీకృష్ణ యాదవ్…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను షాద్‌నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ యువ నాయకుడు వై. మురళీకృష్ణ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
బుధవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ప్రత్యేకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా షాద్‌నగర్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, యువతను పార్టీ వైపు ఆకర్షించే అంశాలపై చర్చించినట్లు సమాచారం. నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాబోయే ఎన్నికలపై కేటీఆర్‌తో మురళీకృష్ణ యాదవ్ చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేయాలని, ప్రజా సమస్యలపై పోరాడాలని ఈ సందర్భంగా కేటీఆర్ సూచించినట్లు సమాచారం. పార్టీ పిలుపునిచ్చిన అనేక కార్యక్రమాల్లో ప్రజల మద్దతు కూడగట్టలో షాద్‌నగర్ నియోజకవర్గ టిఆర్ఎస్ నాయకత్వం ముందంజలో ఉందని ప్రత్యేకంగా అభినందించారు రాబోవు రోజుల్లోనూ మరింత కృషి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించినట్లు తెలిపారు.
M. నరసింహ రెడ్డి మేజర్ న్యూస్ ఫరూక్ నగర్…