ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి -బీజేపీ రాష్ట్ర మెడికల్ సెల్ కన్వీనర్ డాక్టర్ కొప్పుల రాజశేఖర్
ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడంలో ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని, ఎన్నో సంవత్సరాలుగా వైద్య, ఆరోగ్య రంగంలో సేవలందిస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం గుర్తించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర మెడికల్ సెల్ కన్వీనర్ డాక్టర్ కొప్పుల రాజశేఖర్ కోరారు. జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం ఎన్ హెచ్ ఎం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సమ్మె శిబిరాన్ని సందర్శించిన బీజేపీ రాష్ట్ర మెడికల్ సెల్ కన్వీనర్ ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగుల సేవలను గుర్తించి వారికి ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు, అర్హులైన కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల బాధ్యతలు, విధులకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని అన్నారు. కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గౌస్ పాషా, అడిషనల్ జనరల్ సెక్రటరీ కల్పన, ఎన్ హెచ్ ఎం జేఏసీ ప్రెసిడెంట్ డాక్టర్ బాలకృష్ణ, ప్రదాన కార్యదర్శి దామగట్ల కుమార్, హైమావతి, గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసులు, డాక్టర్ మహతి, సభ్యులు డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ రాజు, డాక్టర్ సాయి మణికంఠ, డాక్టర్ జగన్, మహిళా విభాగం ప్రెసిడెంట్ రజియా తదితరులు పాల్గొన్నారు.
పి . వినయ్ కుమార్, నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్