BREAKING
హత్య కేసులో భార్యాభర్తలు అరెస్ట్ --స్మార్ట్‌ఫోన్ స్వాధీనం ఆసియా పతక విజేతలతో ప్రధాని మోడీ సమావేశం మేడ్చల్ డిపో TJMU ఘన విజయం.. గౌరవ అధ్యక్షుడిగా జగన్ గౌడ్, సెక్రటరీగా శ్రీనివాస్ మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణం.. క్రమశిక్షణ, కష్టం తోలినాళ్ల నుంచి అగ్రస్థానం వరకు! ముంబైలో లగ్జరీ ఆఫీస్ స్పేస్‌ను లీజుకిచ్చిన సైఫ్ అలీ ఖాన్.. ప్రతినెలా భారీగా వస్తున్న అద్దె! కొలిక్కి వస్తున్న సీట్ల సర్దుబాటు ఎన్నికల పరిశీలకులుగా 28 మంది ఐఏఎస్‌ల నియామకం మొలకెత్తిన గింజలు తింటే నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా?.. వీటిని తినే సరైన విధానం ఇదే! పిల్లలు మొబైల్ ఫోన్‌కు ఎందుకు బానిసలవుతున్నారు?.. తల్లిదండ్రులు తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే! మల్లారెడ్డిగూడెంకు మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి.. స్పీకర్‌కు సర్పంచ్ వినతి స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపుకు కృషి చేయండి చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ రేసులో ' మీసాల ' ? .....పోటీ ' బెల్లాన వర్సెస్ మీసాల' కానుందా?.... అక్రమంగా అమర్చిన 12 మోటార్లు స్వాధీనం డాక్టర్ బి.వి. రాజు 106వ జయంతి.. ఘనంగా సేవా కార్యక్రమాలు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే ఈ మార్పులు తప్పనిసరి.. ప్రశాంతమైన వాతావరణం కోసం ఇవి చేయండి!

బాసర మూల నక్షత్రం వేడుకలకు 200 మంది పోలీసులతో పటిష్ట భద్రత

Select Suryaa Now
బాసర మూల నక్షత్రం వేడుకలకు 200 మంది పోలీసులతో పటిష్ట భద్రత
 సూర్య నిర్మల్ ప్రతినిధి.నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో రేపు జరగనున్న మూల నక్షత్రం మహా అక్షరాభ్యాస కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, భక్తుల భద్రత దృష్ట్యా జిల్లా పోలీస్ శాఖ విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేపట్టింది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల,  ఆధ్వర్యంలో బాసరలోని ఎం.కె. కన్వెన్షన్ హాల్‌లో బందోబస్తు విధులకు హాజరైన సుమారు 200 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి విధుల నిర్వహణపై బ్రీఫింగ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఆలయ పరిసరాల్లో రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, గోదావరి నది స్నాన ఘట్టాల వద్ద భద్రత, నది ప్రవాహ ఉధృతి పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రతి పోలీసు సిబ్బంది తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ, సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
 
భక్తులకు పోలీస్ శాఖ సూచనలు:
 
- పోలీసు అధికారులు, సిబ్బంది ఇచ్చే సూచనలు తప్పనిసరిగా పాటించాలి.
- ఆలయ పరిసరాల్లో క్రమశిక్షణ పాటిస్తూ, తోపులాటకు దూరంగా ఉండాలి.
- గోదావరి నది స్నాన ఘట్టాల వద్ద అప్రమత్తంగా ఉండాలి. నీటి ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లకూడదు.
- చిన్నారులను ఎల్లప్పుడూ తమ వెంటనే ఉంచుకోవాలి. పిల్లలు తప్పిపోతే వెంటనే సమీప పోలీసు సిబ్బందిని సంప్రదించాలి.
- వాహనాలను సూచించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలపాలి. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకూడదు.
- అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.
- అత్యవసర పరిస్థితుల్లో సమీపంలోని పోలీసు సిబ్బంది సహాయం తీసుకోవాలి.
 
మూల నక్షత్రం మహా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపట్టింది. భక్తులు పోలీసులకు సహకరించి, సురక్షితంగా అమ్మవారిని దర్శించుకొని తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించుకోవాలని జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిలతో పాటు అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.