telanagana
యశోద ఆస్పత్రిలో అధునాతన రోబోటిక్ ఎండోస్కోపీ ద్వారా న్యూరో చికిత్సలు..
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి తెలంగాణ రాష్ట్రంలో యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో మెదడు, వెన్నెముక సమస్యలకు అత్యాధునిక చికిత్సలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయని యశోద సెంటర్ ఫర్ న్యూరోఎండోస్కోపీ అండ్ రోబోటిక్ న్యూరోసర్జరీ వైద్యులు డా. కృష్ణ తేజ్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి యశోద హాస్పిటల్స్ బ్రాంచిలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్లో తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో న్యూరోఎండోస్కోపీ, రోబోటిక్-అసిస్టెడ్ సర్జరీ, అధునాతన ఇమేజింగ్ ద్వారా ఇన్వాసివ్ విధానంలో చికిత్సలు అందిస్తున్నామని కృష్ణ తేజ్ రెడ్డి వివరించారు. మెదడు కణితులకు ఇంట్రాఆపరేటివ్ ఎంఆర్ఐ సహాయంతో శస్త్రచికిత్స సమయంలోనే కణితి తొలగించే విషయాన్ని అంచనా వేసి కీలక మెదడు భాగాలకు హాని కలగకుండా సురక్షితంగా తొలగిస్తున్నామని తెలిపారు. మందులకు లొంగని మూర్ఛవ్యాధికి రోబోటిక్ సహాయంతో సహా పలు శస్త్రచికిత్స ఎంపికలు తమ వద్ద ఉన్నాయన్నారు.
తీవ్రమైన ముఖ నొప్పి అయిన ట్రైజెమినల్ న్యూరల్జియాకు ఎండోస్కోపిక్ మైక్రోవాస్కులర్ డికంప్రెషన్ ద్వారా దీర్ఘకాలిక ఉపశమనం కల్పిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఇప్పటివరకు 110 కేసులను విజయవంతంగా చేశామని వెల్లడించారు. ప్రజల్లో అవగాహన కోసం అక్టోబర్ 7న ప్రపంచ ట్రైజెమినల్ న్యూరల్జియా దినోత్సవం రోజున ప్రత్యేక క్లినిక్ను ప్రారంభించామని చెప్పారు. కామారెడ్డి, చుట్టుపక్కల జిల్లాల ప్రజలు ఈ అధునాతన సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కామారెడ్డి బ్రాంచ్ ఇన్ఛార్జి శ్రీనివాస్ పాల్గొన్నారు.