BREAKING
నేటి పంచాంగం: 17 అక్టోబర్ 2026.. నేటి రాశి ఫలాలు: 17 అక్టోబర్ 2026.. ద్వాదశ రాశుల వారి దిన ఫలాలు మరియు గ్రహ స్థితిగతులు యువత క్రీడల్లో రాణించాలి అందరూ గెలవాలి -ఆనం గౌరవం నిలపాలి ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ జంపాని కుమార్ అక్బరాబాదులో సేవ సంకల్ప అభియాన్ వైద్య శిబిరం చిన్నారిని ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత వెంకన్న ఆగకుండా అభివృద్ధి సాగాలంటే.. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి! బుచ్చి మునిసిపాలిటీలో తొలి నామినేషన్ దాఖలు మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి-డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కిమ్స్ హాస్పిటల్లో ఘనంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు వేదగిరిపై విజయలక్ష్మి గా భక్తులను కటాక్షించిన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి అలంకారంలో ఆదిలక్ష్మి అమ్మవారు నీరు లేక కరెంటు లేక పంటలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు

యాసంగిలో వరి సాగు తగ్గించండి

Select Suryaa Now
యాసంగిలో వరి సాగు తగ్గించండి

సూర్య ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్ :రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, తాగు, సాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు రైతులు, ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలవాలని సీఎం రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాబోయే పది నెలలపాటు అందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఉన్న నీళ్లను పొదుపుగా వాడుకోవాలని సూచించారు. కొందామన్నా నీళ్లు కొనుగోలు చేసే పరిస్థితి లేదని స్పష్టం చేసిన ఆయన, రైతులు ఎవరో చెప్పే మాటలు నమ్మవద్దని, ఈ యాసంగిలో వరి పంట వేయకండి అని కోరారు. సాధ్యమైనంతవరకు యాసంగి పంటను తగ్గించి, ఒక సీజన్ పంటను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పంట వేయని కారణంగా ఉపాధి కోల్పోయే రైతు కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పిస్తామని, పంట సాగు చేయని రైతులను కేంద్ర ప్రభుత్వం కూడా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే సమయంలో రాష్ట్రానికి అదనపు విద్యుత్‌ను సబ్సిడీ ధరకు అందించాలని కేంద్రాన్ని కోరారు. కొన్ని వర్గాలు ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే పైశాచిక ఆనందం పొందుతున్నాయని సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు.