BREAKING
నేటి పంచాంగం: 17 అక్టోబర్ 2026.. నేటి రాశి ఫలాలు: 17 అక్టోబర్ 2026.. ద్వాదశ రాశుల వారి దిన ఫలాలు మరియు గ్రహ స్థితిగతులు యువత క్రీడల్లో రాణించాలి అందరూ గెలవాలి -ఆనం గౌరవం నిలపాలి ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ జంపాని కుమార్ అక్బరాబాదులో సేవ సంకల్ప అభియాన్ వైద్య శిబిరం చిన్నారిని ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత వెంకన్న ఆగకుండా అభివృద్ధి సాగాలంటే.. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి! బుచ్చి మునిసిపాలిటీలో తొలి నామినేషన్ దాఖలు మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి-డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కిమ్స్ హాస్పిటల్లో ఘనంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు వేదగిరిపై విజయలక్ష్మి గా భక్తులను కటాక్షించిన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి అలంకారంలో ఆదిలక్ష్మి అమ్మవారు నీరు లేక కరెంటు లేక పంటలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు

విద్యాలక్ష్మి అలంకారంలో ఆదిలక్ష్మి అమ్మవారు

Select Suryaa Now
విద్యాలక్ష్మి అలంకారంలో ఆదిలక్ష్మి అమ్మవారు

నెల్లూరు కల్చరల్/ రాపూరు మేజర్ న్యూస్ 
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో శుక్రవారం శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామికి అన్నకూటోత్సవం (తిరుప్పావడ సేవ) అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయ ప్రధానార్చకులు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఈ సేవను కన్నులపండువగా జరిపించారు.
ఈ సందర్భంగా ఆలయ ఉప కమీషనర్, కార్యనిర్వహణాధికారి కోవూరు జనార్ధన రెడ్డి మాట్లాడుతూ.. ఆలయంలో ప్రతి శుక్రవారం అన్నకూటోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు రూ. 500 చెల్లించి ఈ సేవలో పాల్గొనవచ్చని, సేవలో పాల్గొన్న భక్తులకు గోత్రనామాలతో అర్చన చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలతో పాటు ఒక కేజీ పులిహోర అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన శుక్రవారం శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారి పట్టమహిషి ఆదిలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం అమ్మవారికి పట్టువస్త్ర సమర్పణ, ప్రత్యేక పుష్పాలంకరణ గావించి, ఉదయం 10 గంటలకు స్నపన తిరుమంజనం జరిపించారు. సాయంత్రం  ప్రత్యేక పుష్పాలంకరణ, సామూహిక కుంకుమార్చన నిర్వహించగా, ఆదిలక్ష్మి అమ్మవారు 'విద్యాలక్ష్మి' అలంకారంలో పద్మ పీఠంపై కొలువుదీరి ప్రాకారోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆదిలక్ష్మి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఈరోజు సాయంత్రం నిర్వహించే సహస్ర దీపాలంకరణ సేవను రద్దు చేసినట్లు ఆలయ ఈవో కోవూరు జనార్ధన రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.