మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి-డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్
మరిపెడ, మేజర్ న్యూస్, పట్టణ పరిశుభ్రతలో మున్సిపాలిటీలో పనిచేసే సిబ్బంది సేవలు వెలకట్టలేనివని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు రాంచంద్రునాయక్ కొనియాడారు. మరిపెడ మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఏడోరోజు వేపకాయ బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ వర్కర్లకు చీరలు, దుస్తులు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పట్టణం అభివృద్ధి దశలో మున్సిపల్ సిబ్బంది పాత్ర ఎంతో ఉంటుందని తెలిపారు. వారి సేవల తోనే పట్టణం పరిశుభ్రతతోనిండి ఉంటుందని పేర్కొన్నారు.మున్సిపల్ పాలక వర్గం,అధికారులు, సుబ్బంది తో కలసి బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ కాలం సునీత రవీందర్ రెడ్డి, కమిషనర్ నరేష్ రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ ;చంద్రశేఖర్, మరిపెడ, మహబూబాబాద్ జిల్లా