ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు-ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్
కేసముద్రం, మేజర్ న్యూస్, ప్రజా సమస్యల పరిష్కారం లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ హెచ్చరించారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం లో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే మురళి నాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళి నాయక్ సమావేశానికి గైర్హాజరైన సర్పంచుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై నిర్వహించే సమావేశాలకు ప్రజా ప్రతినిధులు బాధ్యతగా హాజరుకావాలని సూచించారు.గ్రామాల్లో రైతులకు విద్యుత్ కోతలు లేకుండా చూడాలని, ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారులు ప్రజలకు 24 గంటలు అందు బాటులో ఉండాలని, ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సూచించారు.అధికారులు స్పందించడం లేదనే ఫిర్యాదులు తన దృష్టికి వస్తే సంబంధిత వారిపై చర్యలు తీసుకుంటా మని ఎమ్మెల్యే హెచ్చ రించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులకు తన నియోజకవర్గంలో స్థానం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, జిల్లా రోడ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ సభ్యులు రావుల మురళి, డిఆర్డిఓ మధుసూదన్, ఎంపీడీవో క్రాంతి కుమారి,తహశీల్దార్ జి. వివేక్,వివిధ గ్రామాల సర్పంచులు,పంచాయతీ కార్యదర్శులు,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రిపోర్టర్: వెంకటేశ్వర్లు, కేసముద్రం, మహబూబాబాద్ జిల్లా