BREAKING
నేటి పంచాంగం: 17 అక్టోబర్ 2026.. నేటి రాశి ఫలాలు: 17 అక్టోబర్ 2026.. ద్వాదశ రాశుల వారి దిన ఫలాలు మరియు గ్రహ స్థితిగతులు యువత క్రీడల్లో రాణించాలి అందరూ గెలవాలి -ఆనం గౌరవం నిలపాలి ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ జంపాని కుమార్ అక్బరాబాదులో సేవ సంకల్ప అభియాన్ వైద్య శిబిరం చిన్నారిని ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత వెంకన్న ఆగకుండా అభివృద్ధి సాగాలంటే.. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి! బుచ్చి మునిసిపాలిటీలో తొలి నామినేషన్ దాఖలు మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి-డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కిమ్స్ హాస్పిటల్లో ఘనంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు వేదగిరిపై విజయలక్ష్మి గా భక్తులను కటాక్షించిన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి అలంకారంలో ఆదిలక్ష్మి అమ్మవారు నీరు లేక కరెంటు లేక పంటలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు

అందరూ గెలవాలి -ఆనం గౌరవం నిలపాలి

Select Suryaa Now
అందరూ గెలవాలి -ఆనం గౌరవం నిలపాలి

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :
ఆత్మకూరు మున్సిపల్, నియోజకవర్గంలోని అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలవాలి, మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి గౌరవం నిలపాలి అని కూటమి నాయకులు భావిస్తున్నారు.రాజకీయ రంగంలో దశాబ్దాల అనుభవం, అంకితభావం మరియు ప్రజలతో మమేకమయ్యే తత్వమున్న నాయకులలో ఆనం రామనారాయణ రెడ్డి  ఒకరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి నేటి నవ్యాంధ్రప్రదేశ్ వరకు అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆయన, తనదైన రాజకీయ ముద్రను వేసుకున్నారు. 2024లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆయన ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి సాధించిన విజయం కేవలం ఒక ఎన్నికల గెలుపు మాత్రమే కాదు, అది నాయకత్వ పటిమకు, ప్రజా విశ్వాసానికి నిదర్శనం.2024 ఎన్నికల సమయంలో ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆత్మకూరునియోజకవర్గానికి చాలా తక్కువ సమయంలో పరిమిత ప్రచార గడువుతో వచ్చారు. అప్పటికే అక్కడ సంస్థగతంగా బలంగా పాతుకుపోయి ఉన్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని మరియు పార్టీ యంత్రాంగాన్ని ఎదుర్కొని విజయం సాధించడం సామాన్యమైన విషయం కాదు. అయితే, తన దశాబ్దాల రాజకీయ అనుభవాన్ని రంగరించి, ప్రజల నాడిని పట్టుకోవడంలో ఆయన విజయం సాధించారు. వ్యూహాత్మక అడుగులు వేస్తూ, ప్రతి పౌరుడిని నేరుగా కలుసుకుంటూ ఆయన ముందుకు సాగారు.నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో ఆయనకు అనేక గ్రామాలు, ప్రాంతాలలో ప్రజల నుండి రోడ్ల నిర్మాణం మరియు మౌలిక వసతుల కల్పనపై విజ్ఞప్తులు వచ్చాయి. గత ఐదు లేదా పదేళ్ల కాలంలో పాలనలో ఉన్న ప్రభుత్వం కనీసం ప్రాథమిక అవసరాలైన రోడ్లను కూడా వేయలేకపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర నిరాశ వ్యక్తమైంది. "ఇంతకాలం ప్రభుత్వం ఉండి, కనీసం రోడ్లు కూడా వేయలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు నేను తిరుగుతుంటే నన్ను అడుగుతున్నారు" అని ఆయన ప్రజల ముందు వాస్తవాలను ఉంచారు.
కేవలం సమస్యలను గుర్తించడమే కాకుండా, ఆ క్షణమే ప్రతి ప్రాంతానికి స్పష్టమైన హామీలు ఇచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే, ఇచ్చిన మాట ప్రకారం రికార్డు స్థాయిలో ఆయా ప్రాంతాలలో రోడ్ల నిర్మాణాలు మరియు అభివృద్ధి పనులను వేగవంతం చేసి చూపించారు. ఇంత స్వల్ప కాలంలో ప్రజలను, స్థానిక నాయకులను తనవైపు తిప్పుకొని ఆయన సాధించిన విజయం నిజంగా "నభూతో న భవిష్యత్" అనదగినదిగా నిలిచింది.శాసనసభ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని అందించిన ఆత్మకూరు నియోజకవర్గంలోని ఆత్మకూరు మున్సిపాలిటీలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో కూటమి తరఫున పోటీ చేస్తున్న కౌన్సిలర్ల విజయం అత్యంత కీలకం. ఒకవేళ కూటమి అభ్యర్థులు ఎవరైనా ఓడిపోతే, అది కేవలం ఆ పార్టీ ఓటమి మాత్రమే కాదు, నియోజకవర్గ ప్రజలకు నిరంతరం సేవ చేస్తూ అభివృద్ధిని కాపాడుతున్న ఆనం రామనారాయణ రెడ్డి గౌరవాన్ని నేతలు,పోటీ అభ్యర్థులు తగ్గించినట్లు అవుతుంది.అభివృద్ధి నిరంతర ప్రక్రియ. ఆత్మకూరును మరింత ముందుకు తీసుకెళ్లాలన్నా, ఆనం ఆశించిన ప్రగతి ఫలాలు ప్రతి గడపకూ చేరాలన్నా కూటమి అభ్యర్థుల భారీ గెలుపు ఎంతో అవసరం. ఆయన నాయకత్వానికి అండగా నిలవడం, నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలందరూ వేసే సరైన అడుగు అవుతుందని కూటమి నేతలు భావిస్తున్నారు