బుచ్చి మునిసిపాలిటీలో తొలి నామినేషన్ దాఖలు
బుచ్చిరెడ్డిపాలెం, మేజర్ న్యూస్
బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో నామినేషన్ల ప్రక్రియకు తొలిరోజైన శుక్రవారం వైసిపి చైర్ పర్సన్ అభ్యర్థి షేక్ షకిలా బేగం నామినేషన్ దాఖలు చేశారు.మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, వైసిపి కార్యకర్తలతో కలిసి మున్సిపల్ కార్యాలయంలో ఆమె నామినేషన్ వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలలో మైనారిటీలకు పెద్ద పీట వేసి ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కల్పించిన మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి, మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ప్రజా తీర్పును ఎవరూ ఆపలేరని గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని ప్రజలు మరిచిపోరన్నారు. అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత మున్సిపల్ ఎన్నికలలో చైర్ పర్సన్ గా తనను గెలిపించవలసిందిగా ప్రజలను కోరారు.
..............................
కౌన్సిలర్ అభ్యర్థిగా షేక్ షాహుల్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా షేక్ షాహుల్ మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం తన నామినేషన్ దాఖలు చేశారు. దీంతో తొలి రోజైన శుక్రవారం రెండు నామినేషన్ లు దాఖలైనట్లయింది. కాగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ కూటమిఅభ్యర్థిని ప్రకటించకపోవడం గమనార్హం.