BREAKING
నేటి పంచాంగం: 17 అక్టోబర్ 2026.. నేటి రాశి ఫలాలు: 17 అక్టోబర్ 2026.. ద్వాదశ రాశుల వారి దిన ఫలాలు మరియు గ్రహ స్థితిగతులు యువత క్రీడల్లో రాణించాలి అందరూ గెలవాలి -ఆనం గౌరవం నిలపాలి ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ జంపాని కుమార్ అక్బరాబాదులో సేవ సంకల్ప అభియాన్ వైద్య శిబిరం చిన్నారిని ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత వెంకన్న ఆగకుండా అభివృద్ధి సాగాలంటే.. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి! బుచ్చి మునిసిపాలిటీలో తొలి నామినేషన్ దాఖలు మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి-డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కిమ్స్ హాస్పిటల్లో ఘనంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు వేదగిరిపై విజయలక్ష్మి గా భక్తులను కటాక్షించిన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి అలంకారంలో ఆదిలక్ష్మి అమ్మవారు నీరు లేక కరెంటు లేక పంటలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు

ఆగకుండా అభివృద్ధి సాగాలంటే.. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి!

Select Suryaa Now
ఆగకుండా అభివృద్ధి సాగాలంటే.. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి!

నెల్లూరు సిటీ, మేజర్ న్యూస్

నెల్లూరు నగరంలోని 21వ డివిజన్ (పాత 16వ డివిజన్)లో జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల, విజయలక్ష్మి గునుకుల ఆధ్వర్యంలో కూటమి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారం గురువారం కూడా యథావిధిగా కొనసాగింది. గత నెల రోజులుగా డివిజన్‌లోని ప్రతి గడపను ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధికి మద్దతు తెలపాలని వారు ప్రజలను కోరుతున్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. “ఆగకుండా అభివృద్ధి సాగాలంటే కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి. పరిపాలనా అనుభవం, అభివృద్ధిపై స్పష్టమైన దార్శనికత కలిగిన కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలపండి” అని పిలుపునిచ్చారు.

జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న కీలక నిర్ణయాలు రాష్ట్ర ప్రగతికి దోహదపడుతున్నాయని, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని వివరించారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన ప్రజా సమస్యలకు పరిష్కారాలు చూపిస్తూ, సమసమాజ స్థాపన దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

నెల్లూరు నగర ఎమ్మెల్యే, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు నగర అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ నెల్లూరును ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు కల్పించడం, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ, నగరంలో పార్కులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాలు అందించడం వంటి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులకు దోహదపడుతున్నాయని వివరించారు.

అదేవిధంగా మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి తమ కాళ్లపై తాము నిలబడేలా ప్రోత్సహించడం, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు మెరుగైన జీవనావకాశాలు కల్పించడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించే కూటమి అభ్యర్థులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, డివిజన్‌లోని సమస్యలను పరిష్కరించడంలోనూ, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలోనూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని తెలిపారు.

“ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, ప్రజలతో మమేకమవుతూ, అభివృద్ధికి అండగా నిలవడమే మా లక్ష్యం. నెల్లూరు నగరం మరింత అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులకు ప్రజలు తమ విలువైన మద్దతు అందించాలి” అని కిషోర్ గునుకుల, విజయలక్ష్మి గునుకుల విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల,మనోజ్ కేదారి, గుత్తి శ్రీకాంత్, వీరమహిళ విజయలక్ష్మి గునుకులతో పాటు నాగేంద్ర బాలు, నరహరి, కృష్ణమోహన్ రెడ్డి ,బాలాజీ ,వీరమహిళలు ప్రవల్లిక,ఆమని ప్రశాంతి,విజయ, శ్రీలక్ష్మి, కృష్ణవేణి,సునీత, తదితరులు ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు.