ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్ఐ జంపాని కుమార్
ఆత్మకూరు, మేజర్ న్యూస్ :
జరుగనున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆత్మకూరు ఎస్ఐ జంపాని కుమార్ సూచించారు. పోలీస్ శాఖ చేపట్టిన గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మండలం నబ్బినగరం గ్రామంలో ఎస్ఐ జంపానీ కుమార్ తన సిబ్బందితో కలిసి గ్రామస్తులకు నేరాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులను ఒకచోట చేర్చి వారితో మాట్లాడుతూ, రానున్న ఎన్నికల సమయంలో ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో జరిగే అసాంఘిక కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.అలాగే గ్రామంలో అపరిచిత వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. గ్రామాల్లో ఎలాంటి గొడవలు, ఘర్షణలు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించాలని ఎస్ఐ జంపానీ కుమార్ కోరారు.
గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు